తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఆర్​సీటీసీ బంపర్ ఆఫర్​.. రైలు ఆలస్యమైతే పరిహారం - రైలు ఆలస్యానికి పరిహారం

రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్​సీటీసీ తన మొదటి రైలు సర్వీసును అక్టోబర్​ 5న ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రయాణికులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. దిల్లీ-లఖ్​నవూ మధ్య నడిచే తేజస్ ఎక్స్​ప్రెస్ ఆలస్యమైతే.. ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. దీనితో పాటు ఉచిత జీవిత బీమా, దొంగతనం, దోపిడీలు జరిగితే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తామని ప్రకటించింది.

ఐఆర్​సీటీసీ బంపర్ ఆఫర్​.. రైలు ఆలస్యమైతే పరిహారం

By

Published : Oct 1, 2019, 8:09 PM IST

Updated : Oct 2, 2019, 7:17 PM IST

రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్​సీటీసీ దేశంలోనే మొదటిసారిగా ఓ బంపర్​ ఆఫర్​ తీసుకొచ్చింది. దిల్లీ - లఖ్​నవూ మధ్య నడిచే తేజస్​ ఎక్స్​ప్రెస్​లో పయనం ఆలస్యమైతే... ప్రయాణికులకు పరిహారం అందిస్తామని ప్రకటించింది. ఐఆర్​సీటీసీ తన మొదటి రైలు సర్వీసును (అక్టోబర్​ 5న ప్రారంభం) ప్రారంభించక ముందే ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.

ఆఫర్ల మీద ఆఫర్లు

రైలు ఒక గంట ఆలస్యమైతే రూ.100, రెండు గంటల ఆలస్యానికి రూ.250 చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఐఆర్​సీటీసీ ఈ పరిహారం మొత్తాన్ని ఎలా లెక్కిస్తుందో.. ఏ విధంగా అందిస్తుందో తెలియజేయలేదు.

ప్రయాణికులకు 25 లక్షల ఉచిత బీమాను అందించనున్నట్లు పేర్కొంది ఐఆర్​సీటీసీ. రైళ్లో దొంగతనం, దోపిడీలు జరిగితే లక్ష రూపాయల బీమా కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. బోర్డు ట్రైనుల్లో మొదటిసారి ప్రయాణించేవారికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఇలా చేయాలి

ప్రయాణికులు ఆన్​లైన్​లో అందించిన లింక్​ ద్వారా బీమా సంస్థ క్లెయిమ్​ ఫారమ్​ను పూరించాల్సి ఉంటుంది. లేదా టోల్ ఫ్రీ నెంబర్​ ద్వారా రైలు ఆలస్యంపై దావా వేయవచ్చు. రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా బీమా కంపెనీని ఆశ్రయించవచ్చు. అవసరమైన పత్రాలు పరిశీలించిన తరువాత రెండు, మూడు రోజుల్లో క్లెయిమ్ పరిష్కారమవుతుందని ఐఆర్​సీటీసీ తెలిపింది.

అక్టోబర్​ 5న ప్రారంభం

ఐఆర్​సీటీసీ మొదటి రైలు తేజస్​ ఎక్స్​ప్రెస్​ అక్టోబర్​ 5న ప్రారంభం కానుంది. ఈ ఎక్స్​ప్రెస్... దిల్లీ - లఖ్​నవూ మధ్య వారంలో ఆరురోజులు నడుస్తుంది.
లఖ్​నవూ నుంచి దిల్లీకి ప్రయాణంలో.. ఏసీ ఛైర్​కార్​ రూ.1,125, ఎగ్జిక్యూటివ్​ ఛైర్​కార్​కు రూ.2,310 ఛార్జ్​ చేస్తారు. దిల్లీ నుంచి లఖ్​నవూకైతే ఈ ధరలు వరుసగా రూ.1,280, రూ.2,450గా ఉంటాయి.

వెండింగ్ మెషీన్ల ద్వారా ప్రయాణికులకు ఉచితంగా టీ, కాఫీ అందించనున్నారు. డబ్బులు చెల్లిస్తే ఆర్ఓ యంత్రాల ద్వారా మంచినీళ్లు కూడా అందిస్తారు.
విమానాల మాదిరిగానే.. ఆన్​బోర్డ్ సేవా సిబ్బంది ట్రాలీల ద్వారా భోజనం వడ్డిస్తారు. జపాన్​లో ఇదే విధమైన వ్యవస్థ ఉండటం గమనార్హం.

ఇతర దేశాల్లో

జపాన్​, పారిస్​ లాంటి నగరాల్లో కనీసం 5 నిమిషాలు రైళ్లు ఆలస్యమైతే.. ఆలస్యాన్ని ధ్రువీకరిస్తూ రైల్వే కంపెనీలు ప్రయాణికులకు సర్టిఫికేట్లు అందజేస్తాయి. వీటిని ఉపయోగించి ఎందుకు ఆలస్యమైందో... తమ కంపెనీలు, పాఠశాలలకు చూపించవచ్చు. యూకేలో అయితే స్వయంచాలకంగా ప్రయాణికులకు పరిహారం అందుతుంది.

ఇదీ చూడండి:ఆశలు సజీవం... 'విక్రమ్'​తో లింక్​ కోసం ఇస్రో కృషి

Last Updated : Oct 2, 2019, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details