మసూద్ అజార్ విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు సమాధానమిచ్చారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకోవటం... దౌత్యపరమైన వైఫల్యమనే ఆరోపణలను తిప్పికొట్టారు.
2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని మొదటిసారి ప్రతిపాదించినపుడు భారత్ ఏకాకిగా ఉందని గుర్తుచేశారు సుష్మా. కానీ ఇప్పుడు భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా చైనా మినహా అన్ని దేశాల మద్దతు లభించిందని తెలిపారు.
చైనా అధ్యక్షుడికి మోదీ బయపడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన మరుసటి రోజునే ఈ వ్యాఖ్యలు చేశారు సుష్మా. అజార్‌ను నిషేధించాలన్న ప్రతిపాదనపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.