కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ సహా కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా లక్షలాదిమంది ముస్లింలు భారత్‌ను విడిచివెళ్లే అవకాశం ఉందన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ప్రపంచ శరణార్థుల సమావేశంలో భాగంగా ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్... పాక్ మరోసారి అసత్యాలను వ్యాపింపజేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. పూర్తిగా భారత అంతర్గత విషయమైన అంశాలను అంతర్జాతీయ వేదికల్లో లేవనెత్తడం సరికాదని స్పష్టం చేశారు.
"ప్రపంచ వేదికలపై పాక్ మరోసారి తనకు అలవాటున్న విధంగానే నిందలు మోపుతోందనే విషయం ప్రపంచ దేశాలకు ఇప్పుడు స్పష్టమైంది. పాక్ చేస్తున్న చర్యలు ఆ దేశ చుట్టుపక్కల ఉన్న దేశాలపై తీవ్ర విఘాతం కలిగిస్తుండటం దురదృష్టకరం."-రవీశ్ కుమార్, భారత విదేశాంగ ప్రతినిధి.
'మీ దేశంపై దృష్టిపెట్టండి'