గురువారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో గురువారం ఆరెంజ్ అలర్ట్, శుక్రవారం యెల్లో అలర్ట్‌ను ప్రకటించింది.
ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్(శుక్రవారం), తూర్పు రాజస్థాన్(శని,ఆది)కు ఆరెంజ్ అలర్ట్, జమ్ముకశ్మీర్(గురువారం), హిమాచల్ ప్రదేశ్(గురు,శుక్ర), పంజాబ్(గురు,శుక్ర), హరియాణా-దిల్లీ(గురు,శుక్ర,శని), పశ్చిమ రాజస్థాన్(శని, ఆది)కు యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది.