కొద్దివారాల క్రితం ముంబయిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఆ ఘటన నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు విజృంభిస్తున్నాయి. కుండపోత వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.
ముంబయిలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో 100 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాలా సోపారాలో కుండపోత వర్షాల వల్ల మోకాళ్ల లోతు నీరు చేరింది. మరోవైపు భారీ వర్షాలు కురవడం వల్ల పలు చోట్ల రైలు పట్టాలు నీటమునిగాయి. పలు రైళ్ల సమయవేళల్లో మార్పులు చేశారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.