ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తరహాలో... ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఇది అత్యవసరమని పేర్కొంది.
"ఆరోగ్య రంగంలో సమూల మార్పులు అవసరమని ఐఎంఏ భావిస్తోంది. ఇందుకోసం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేడర్ల తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది."
- ఐఎంఏ వైద్యుల సంఘం
మోయలేని భారం
'కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖతో సహా రాష్ట్ర ఆరోగ్య విభాగాలకు చెందిన కార్యదర్శుల నుంచి, వివిధ వ్యాధుల నియంత్రణ కార్యక్రమాల ప్రాజెక్టు ఆఫీసర్లు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు, జిల్లా వైద్యాధికారులు... ఇలా అందరూ ఐఎంఏ పరిధిలోకి వస్తారు. వీరి బాధ్యత అంతా ఐఎంఏ ఒక్కటే చూసుకోవాలి'
- డాక్టర్ రాజన్ శర్మ,ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు
అందువల్ల ఇండియన్ మెడికల్ సర్వీస్ అధికారులను నియమించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.