ఆయుర్వేద వైద్యులూ శస్త్ర చికిత్సలు చేయవచ్చంటూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించినట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో డాక్టర్లందరూ ఈ దీక్షలో పాల్గొన్నట్లు తెలిపింది. ఈ నెల 14 వరకు రిలే సమ్మె కొనసాగుతుందని వెల్లడించింది. ఈ నెల 7న మహిళా వైద్యులు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆయుష్మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ అశాస్త్రీయంగా ఉందని వైద్య సంఘం స్పష్టం చేసింది. ఈ కొత్త విధానాలు 'మిక్సోపతి'కి దారితీస్తుందని ఐఎంఏ అభిప్రాయపడింది. దీనిని తక్షణమే ప్రభుత్వం ఉపసహంరించుకోవాలని డిమాండ్ చేసింది.