తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెకన్లలోనే... 19 అంతస్తుల భవనాన్ని కూల్చారు

కేరళలో భారీ స్థాయి అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొచ్చిలోని మరదు ప్రాంతంలోని రెండు భారీ నిర్మాణాలను ఇంప్లోజన్​ పద్దతి ద్వారా నేలమట్టం చేశారు. వందల కిలోల పేలుడు పదార్థాలను భవనాల కూల్చివేతకు  ఉపయోగించారు.

Illegal apartment complex in Kerala brought down; SC order
సెకెన్ల వ్యవధిలో మరదు ఫ్లాట్​ల కూల్చివేత

By

Published : Jan 11, 2020, 12:15 PM IST

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. నిబంధనలు ఉల్లంఘించి కోచిలోని మరదు ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టిన రెండు భారీ భవనాలను శనివారం ఉదయం నేలమట్టం చేశారు. ఇందుకోసం వందల కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. మరదు మున్సిపాలిటీలోని హెచ్‌20 హోలీ ఫేత్‌, ఆల్ఫా అపార్ట్‌మెంట్‌లను నేలమట్టం చేశారు. కేవలం సెకన్ల వ్యవధిలోనే భవనాలు నేలమట్టమయ్యాయి.

మరదు ప్లాట్ల కూల్చివేత

కూల్చివేతకు ముందు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పొరుగున్న ఉన్న భవనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వీటిని నేలమట్టం చేశారు. కూల్చివేత సమయంలో ప్రజలెవరూ అటు పక్కకు రాకుండా ఆంక్షలు విధించారు. 19 అంతస్తుల హెచ్‌20 హోలీ ఫేత్‌ అపార్ట్‌మెంట్‌లో 91 ఫ్లాట్లు ఉన్నాయి. 200 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు ఉపయోగించి దీన్ని నేలమట్టం చేశారు. 17 అంతస్తుల ఆల్ఫా కాంప్లెక్స్‌లో 67 ఫ్లాట్లు ఉన్నాయి.

ఇదే కారణం...

తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించినందుకు సరస్సును ఆనుకుని నిర్మించిన నాలుగు నివాస భవనాలను కూల్చివేయాలని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు రెండు భవనాలను నేలమట్టం చేశారు. ఆదివారం మరో రెండు భవనాలను కూల్చనున్నారు.

ABOUT THE AUTHOR

...view details