తెలంగాణ

telangana

"ఖబడ్దార్​.. చూస్తూ ఊరుకోం"

By

Published : Mar 10, 2019, 1:31 PM IST

పొరుగు దేశం విరోధి అయి, దేశంలోని కొన్ని శక్తులు వారికి సహకరిస్తూ కుట్రలు చేస్తున్నప్పుడు సీఐఎస్​ఎఫ్​ లాంటి బలగాల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తీవ్రవాదులు ఇక దుశ్చర్యలు ఆపాలని హెచ్చరించారాయన.

సీఐఎస్​ఎఫ్​ స్వర్ణజయంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీ

భారత్​లో దాడులకు తెగబడుతున్నతీవ్రవాద సంస్థలను ప్రధాని మోదీ తీవ్రంగా హెచ్చరించారు. ఎల్లకాలం భారత్​ ఉగ్రదాడులను భరించబోదని స్పష్టం చేశారు. పుల్వామా, ఉరి దాడులనుద్దేశించి మాట్లాడిన మోదీ.. "చేసింది చాలు ఇక ఆపండి" అని హితవు పలికారు.

దిల్లీలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్​ఎఫ్​) స్వర్ణజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీ దాయాదిపై పరోక్ష విమర్శలు చేశారు. దేశంలోని వివిధ సంస్థల రక్షణలో సీఐఎస్​ఎఫ్​ పాత్రను కొనియాడారు.

సీఐఎస్​ఎఫ్​ స్వర్ణజయంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీ

"పక్కనున్న విరోధి దేశం యుద్ధం చేయలేని స్థితిలో ఉండి, దేశీయ శక్తులు కుట్రలతో దానికి దన్నుగా నిలిచినప్పుడు, తీవ్రవాదం వికృతరూపం దాల్చినప్పుడు.. సరిహద్దుల్లో రక్షణ మరింత సవాలుగా మారుతోంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో దేశం, దేశంలోని వనరుల రక్షణకు మీరు చేసే కృషి అమూల్యమైనది." - నరేంద్ర మోదీ

ABOUT THE AUTHOR

...view details