సుస్థిరమైన సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధంగా ఐఐటీలు పరీశోధన కార్యక్రమాలు ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఐఐటీలతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో సమాజానికి సంబంధించిన పరిశోధనలు జరగాలని పేర్కొన్నారు. వాతావరణ, వైద్యం సహా మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనడంపై దృష్టిసారించాలని అన్నారు.
"దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సుస్థిరమైన పరిష్కారాలను కనిపెట్టి, సమాజంపై ప్రభావం చూపగలిగినప్పుడే భారత్లోని ఉన్నత విద్యా సంస్థలను ప్రపంచంలోనే ఉత్తమమైన వాటిలో ఒకటిగా పరిగణించడం జరుగుతుంది. ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చి, పురోగతిని వేగవంతం చేసే విధంగా పరిశోధనలు జరగాలి."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
రైతులు, గ్రామీణ భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐఐటీలు దృష్టిసారించాలని అన్నారు వెంకయ్య. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడమే కాకుండా.. ప్రోటీన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారం ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని.. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పరిశోధనలు నిర్వహించడం చాలా ముఖ్యమని వివరించారు వెంకయ్య.
పరిశ్రమలు, విద్యా సంస్థలు సహకరించుకోవాలి