తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరస్​పై పోరులో 'జుగాడ్'​- త్రీడీ ప్రింటర్​తో మాస్కులు - coronavirus death toll

దేశంలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా పెరుగుతోంది. వ్యాధి నియంత్రణ, నిర్ధరణ, నిర్మూలన దిశగా ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పరిశోధనలు ప్రారంభించాయి. ఐఐటీ రూర్కీ పరిశోధకులు తక్కువ వ్యయంతో మాస్కులను రూపొందించారు. అనుమానితుల నుంచి నమూనా సేకరణ కోసం పుణెకు చెందిన శాస్త్రవేత్త పాలిమర్​ పుల్లలు తయారు చేశారు.

corona shields
వైరస్ పరికరాల తయారీ కోసం పరిశోధకుల కృషి

By

Published : Apr 4, 2020, 11:51 AM IST

వైరస్​ నియంత్రణ, నిర్ధరణకు సంబంధించిన పరికరాల తయారీకి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. రూర్కీ ఐఐటీ పరిశోధకులు తక్కువ వ్యయంతో వైరస్​ నియంత్రణ కోసం మాస్కులు తయారుచేశారు. 3డీ ప్రింటింగ్ విధానంలో వీటిని రూపొందించారు. ఈ మాస్కులను ఎయిమ్స్ రిషికేశ్ వైద్య సిబ్బందికి అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

ఇలా రక్షణ..
ముఖరక్షణ కవచాలు

నమూనాల సేకరణకోసం..

వైరస్ అనుమానితుల నమూనాలు సేకరించేందుకు రసాయన సమ్మేళనంతో కూడిన పాలిమర్ పుల్లలను రూపొందించారు పుణె శాస్త్రవేత్త డా. మిళింద్ కులకర్ణి. పాలీప్రొఫైలీన్ పదార్ధంతో తయారు చేసినట్లు చెప్పారు. దేశంలో లాక్​డౌన్ కొనసాగుతున్న కారణంగా వైరస్​ కిట్లకు కొరత ఉందని.. తమకు పరిచయం ఉన్న వైద్యులకు నమూనా సేకరణ పుల్లలను అందిస్తున్నట్లు తెలిపారు.

నమూనా సేకరణ కోసం..
పాలిమర్ పుల్లతో శాస్త్రవేత్త మిళింద్ కులకర్ణి

ఇదీ చూడండి:కరోనాపై పోరు: మలి దశలో మరింత జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details