తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోలార్ సర్వేక్రాఫ్ట్​ రూపొందించిన ఐఐటీ - సోలార్ సర్వే క్రాఫ్ట్ ఐఐటీ మద్రాస్

ఓడరేవులు, జలమార్గాల్లో హైడ్రోగ్రాఫిక్, ఓషినోగ్రాఫిక్ సర్వేలు చేపట్టేందుకు ఉపయోగపడే మానవరహిత క్రాఫ్ట్​లను అభివృద్ధి చేశారు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు. సౌరశక్తితో పనిచేసే ఈ క్రాఫ్ట్​ను చెన్నైలో విజయవంతంగా ప్రయోగించారు.

IIT Madras develops unmanned solar craft
ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన సోలార్​ క్రాఫ్ట్

By

Published : Nov 23, 2020, 6:45 PM IST

ఐఐటీ మద్రాస్ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. భారత్​లోని ఓడరేవులు, జలమార్గాల కోసం సౌరశక్తితో పనిచేసే మానవరహిత అటానమస్ 'సర్వే క్రాఫ్ట్​'ను రూపొందించారు. దీన్ని ఉపయోగించి హైడ్రోగ్రాఫిక్, ఓషినోగ్రాఫిక్ సర్వేలను చేపట్టవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి సైతం సమాచారాన్ని వేగంగా పంపించుకోవచ్చు.

ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన సోలార్​ క్రాఫ్ట్

చెన్నైలోని కామరాజర్ కోట నుంచి ఈ క్రాఫ్ట్​ను విజయవంతంగా ప్రయోగించారు. మరింత కఠినమైన పరిస్థితుల్లో దీన్ని పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. కోల్​కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ కోట నుంచి నవంబర్​లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఐఐటీ మద్రాస్​కు చెందిన ఓడరేవులు, జలమార్గాలు, తీర ప్రాంతాల జాతీయ సాంకేతిక కేంద్రం ఇంఛార్జి ప్రొఫెసర్ మురళి తెలిపారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సహాయంతో ఈ సాంకేతికతను వాణిజ్యపరంగా మార్చేందుకు పరిశోధకులు కసరత్తులు చేస్తున్నారు.

"ఈ వ్యవస్థలో ఎకో సౌండర్, జీపీఎస్, బ్రాడ్​బ్యాండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ ఉంటాయి. అదనపు ఓషినోగ్రాఫిక్ పేలోడ్లను తీసుకెళ్లే అవకాశం ఉంది. 360 డిగ్రీల కెమెరా, స్థలాల ఆకృతి, నీటి లోతును కొలిచేందుకు ఉపయోగించే లైడార్​ను సైతం తీసుకెళ్లొచ్చు."

-మురళి, ఐఐటీ మద్రాస్ ఇంఛార్జి ప్రొఫెసర్

ఎక్కువగా లోతు లేని జలాల్లోనూ ఈ వ్యవస్థ కచ్చితమైన కొలతలను అందిస్తుందని తెలిపారు మురళి. భారత సముద్రయాన రంగంలో విదేశీ సాంకేతికతనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా స్వదేశీకరణ వైపు అడుగులు వేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్​ను తీర్చడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పారు.

ఇదీ చదవండి-బంగాల్​ ఎన్నికలకు ముందు ఎంఐఎంకు షాక్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details