తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా రోగులు ఉన్నచోటుకే ఆస్పత్రి! - portable covid 19 hospital

కరోనా రోగులకు ఎక్కడైనా వైద్య సేవలు అందించే సరికొత్త ఆసుపత్రిని మద్రాస్‌-ఐఐటీ అభివృద్ధి చేసింది. వైరస్‌ సోకిన వ్యక్తులున్న ప్రదేశంలోనే చికిత్స చేసేందుకు మెడిక్యాబ్‌ అనే పోర్టబుల్‌ ఆసుపత్రి యూనిట్‌ను రూపొందించింది.

IIT Madras-incubated Startup Develops Portable Hospital Units to Treat COVID-19 patients
మెడిక్యాబ్‌తో కరోనా రోగుల వద్దకే వైద్యం

By

Published : Jul 16, 2020, 7:25 PM IST

కరోనా రోగులకు ఉన్న ప్రదేశాల్లోనే వైద్య చికిత్స అందించేలా వినూత్నంగా ఓ ఆసుపత్రిని రూపొందించింది మద్రాస్‌ ఐఐటీ ఇంక్యుబేషన్‌ స్టార్టప్‌-మాడ్యులస్‌ హౌసింగ్‌.

మెడిక్యాబ్​ ఆసుపత్రి

కొవిడ్​ బాధితులకు ప్రత్యేకమైన వసతులతో కూడిన ఆసుపత్రి తప్పనిసరి. దీంతో పాటు బాధితులను గుర్తించడం దగ్గరి నుంచి వ్యాధికి చికిత్స అందించే వరకు అనేక ఇబ్బందుల తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితులకు అధిగమించేందుకు మద్రాస్‌ ఐఐటీ ఇంక్యుబేషన్‌ స్టార్టప్‌-మాడ్యులస్‌ హౌసింగ్‌ విన్నూతంగా ఆలోచించింది.

ఎక్కడి వారికి అక్కడే చికిత్స..

వ్యాధిగ్రస్తులను గుర్తించి ఎక్కడి వారికి అక్కడే చికిత్స అందించేందుకు అన్ని రకాల సదుపాయలు ఉండే మెడిక్యాబ్‌ ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. ఈ మెడిక్యాబ్‌లో వైద్యుని గది, ఐసోలేషన్‌, మెడికల్‌ గదితోపాటు ఐసీయూతో కూడిన 15 పడకలు ఉంటాయి. ఇందులో రోగిని గుర్తించే దగ్గర నుంచి పూర్తి చికిత్స అందించే వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

మెడిక్యాబ్​ ఆసుపత్రిని ఎక్కడికైనా తరలించడం సులువు!
మెడిక్యాబ్​లో పడకలు

సంతోషంగా ఉంది!

ఇప్పటికే మెడిక్యాబ్‌ను కేరళలోని వయనాడ్‌లో ప్రారంభించగా దేశవ్యాప్తంగా ఈ మైక్రో ఆసుపత్రులను విరివిరిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కరోనాపై పోరులో తాము భాగస్వామ్యం అవుతన్నందుకు సంతోషంగా ఉందని ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్‌ సెల్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి తమస్వతి ఘోష్‌ అన్నారు.

మెడిక్యాబ్‌తో కరోనా రోగుల వద్దకే వైద్యం

ఇదీ చూడండి:గుడ్​ న్యూస్​: తగ్గుతున్న యాక్టివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details