తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇకపై రూ. 500కే కరోనా పరీక్షలు!

దిల్లీ ఐఐటీ ఖరగ్​పుర్​ పరిశోధకులు కరోనాను గుర్తించే పరికరాన్ని తయ్యారు చేశారు. ఈ పరికరంతో వైరస్​ పరీక్షలను రూ.500 ఖర్చుతో చేయవచ్చని తెలిపారు. దీనిని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) ధ్రువీకరించినట్లు ఐఐటీ డైరెక్టర్​ వీకే తీవారి వెల్లడించారు.

IIT-Kharagpur develops low-cost, portable COVID-19 testing device
ఇకపై రూ. 500కే కరోనా పరీక్షలు..!

By

Published : Oct 21, 2020, 7:43 PM IST

తక్కువ ఖర్చుతో, వేగంగా కొవిడ్​ను గుర్తించే పరికరాన్ని దిల్లీలోని ఐఐటీ ఖరగ్​పుర్​ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరంతో కేవలం గంట లోపే వైరస్​ను గుర్తించవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తోన్న వైరస్​ను గుర్తించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

కొవిరాప్ అనే ఈ పరికరం ఖరీదు కేవలం రూ.10,000 కాగా.. దీని ద్వారా ఒకసారి పరీక్ష చేసేందుకు అయ్యే ఖర్చు కూడా రూ.500 కావటం గమనార్హం. ప్రొఫెసర్లు సుమన్‌ చక్రబర్తి, డాక్టర్‌ అరిందమ్‌ మొండెల్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ ఘనతను సాధించారు. కాగా, ఈ విధానానికి ఐసీఎంఆర్‌ అనుమతి కూడా లభించటం విశేషం. ఈ విధానం సులభమే కాకుండా.. ఒక గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చని పరిశోధకులు వివరించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థుల వైద్య ఆవిష్కరణ ప్రశంసనీయమని.. కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌‌‌‌ నిశాంక్‌ అన్నారు. కనీస శిక్షణతో గ్రామీణ యువత కూడా ఉపయోగించగల ఈ పరికరం శక్తి వినియోగం కూడా చాలా తక్కువని ఆయన వెల్లడించారు. ఎక్కడికైనా తరలించేందుకు అనువుగా ఉండే ఈ పరికరం అనేక గ్రామీణ ప్రజల ప్రాణాలు నిలబెడుతుందని మంత్రి అన్నారు.

వైద్య విభాగం వైరాలజీ చరిత్రలోనే ఇదో గొప్ప ముందడుగని.. ఈ విధానాన్ని ప్రస్తుతం వాడుతున్న పీసీఆర్‌ ఆధారిత పరీక్షా విధానంతో మార్పుచేయచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్‌ డైరక్టర్‌ వీకే తివారీ తెలిపారు. తమ కొవిరాప్‌ పరికరానికి పేటెంట్‌ హక్కులను పొందిన అనంతరం భారీ ఎత్తున తయారీ సాధ్యమౌతుందన్నారు. ఇందుకుగాను తాము వివిధ సంస్థలతో చేతులు కలిపేందుకు సిద్ధమని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: తమిళ విద్యార్థుల బుల్లి శాటిలైట్​కు నాసా ఫిదా

ABOUT THE AUTHOR

...view details