తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఐటీ కాన్పుర్ కనిపెట్టిన ఈ పరికరంతో​ కరోనా కట్టడి!

కరోనాపై పోరాటంలో భాగంగా ఐఐటీ-కాన్పుర్, సంజయ్ గాంధీ పీజీఐ కళాశాల సంయుక్తంగా 'పాజిటివ్ ప్రెజర్ రెస్పిరేటర్ సిస్టమ్' అనే పరికరాన్ని రూపొందించాయి. ఈ పరికరం ఎన్​-95 మాస్కు కంటే మెరుగ్గా పనిచేస్తుందని చెబుతున్నారు. ఊపిరితిత్తులకు శ్వాస ద్వారా వైరస్ చేరే అవకాశాన్ని 100 శాతం తగ్గిస్తుందని పేర్కొన్నారు.

positive respiratory system
ఐఐటీ కాన్పుర్

By

Published : Apr 18, 2020, 8:16 PM IST

Updated : Apr 18, 2020, 8:31 PM IST

కరోనాను దరిచేరకుండా రక్షించే ఓ పరికరాన్ని ఐఐటీ- కాన్పుర్​, లఖ్​నవూలోని సంజయ్ గాంధీ పీజీఐ సంయుక్తంగా కనిపెట్టాయి. కరోనా వైరస్​ను ఊపిరితిత్తుల్లోకి పోనియకుండా కట్టడి చేసే 'పాజిటివ్ ప్రెజర్ రెస్పిరేటర్ సిస్టమ్' పరికరం నమూనాను రూపొందించాయి.

ప్రొఫెసర్ డాక్టర్ నచికేత

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్​ను నియంత్రించాలంటే దాని సంక్రమణను ఆపటం చాలా ముఖ్యం. ఇందుకోసం ఐఐటీ- కాన్పుర్, సంజయ్ గాంధీ పీజీఐ కొన్ని రోజులుగా కలిసి కృషి చేస్తున్నాయి. వైరస్​ను శరీరంలోకి వెళ్లనీయకుండా నియంత్రించే రెస్పిరేటరీ సిస్టమ్ పరికరాన్ని నిర్మించాయి.

ఎన్​-95 మాస్కులకన్నా..

ఈ పరికరంతో కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి.. వైరస్ సంక్రమించకుండా రక్షించవచ్చు. ఈ పరికరం ఎన్​-95 మాస్కులకన్నా మెరుగ్గా పని చేస్తుందని ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్​ డాక్టర్ నచికేత అంటున్నారు. ఇది శ్వాసక్రియ ద్వారా వైరస్ ఊపిరితిత్తులలోకి వైరస్​ వచ్చే అవకాశాన్ని నివారిస్తుందని పేర్కొన్నారు.

వీరు రూపొందించిన పరికరానికి 2 కవాటాలు ఉంటాయి. ఒకదాని నుంచి వచ్చే గాలి శరీరంలోకి వెళుతుంది. మరొక దాని నుంచి విడుదలయ్యే గాలి బయటకు వస్తుంది. దీని కోసం ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్ లేదా గాలి సీసాలు ఉపయోగించవచ్చని నచికేత తెలిపారు. స్థానికంగా తయారు చేయటం, దేశీయ పరికరాలు ఉపయోగించటం వల్ల ధర కూడా తక్కువగానే ఉంటుందని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:80 ఆస్పత్రులు తిరిగినా ఆ రోగికి నో ఎంట్రీ!

Last Updated : Apr 18, 2020, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details