కొవిడ్-19పై పోరులో వ్యయాన్ని తగ్గించేందుకు గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. ఆసుపత్రులు, తాత్కాలిక ఐసోలేషన్ వార్డుల్లో తక్షణం ఉపయోగించేందుకు చౌకలో వెదురుతో ఫర్నిచర్‌ను తయారుచేశారు.
ఐసోలేషన్ వార్డుల కోసం వెదురు ఫర్నిచర్ - ఐసోలేషన్ వార్డుల కోసం వెదురు ఫర్నిచర్
కరోనా మహమ్మారిపై పోరుకు గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు వినూత్న ఆలోచన చేశారు. ఐసోలేషన్ వార్డుల్లో తక్షణం ఉపయోగించడానికి వీలుగా.. చౌక ధరకు లభించేందుకు వెదురుతో ఫర్నిచర్ రూపొందించారు. కరోనా కేసులు పెరిగి.. తాత్కాలిక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాల్సి వస్తే వాటిని తక్షణం అందుబాటులోకి తీసుకొచ్చే వీలుంటుందని తెలిపారు.
![ఐసోలేషన్ వార్డుల కోసం వెదురు ఫర్నిచర్ Isolation Wards](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7010104-463-7010104-1588296862012.jpg)
ఐసోలేషన్ వార్డుల కోసం వెదురు ఫర్నిచర్
కరోనా కేసుల సంఖ్య పెరిగి, ఆసుపత్రులు కిక్కిరిసిపోతే, ఇండోర్ స్టేడియాలు వంటి చోట్ల తాత్కాలిక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వసతులు పెంచాల్సి ఉంటుంది. రోగులకు పడకలు, ఇతర ఫర్నిచర్ అవసరమవుతాయి. వీటిని అప్పటికప్పుడు సమకూర్చడం కష్టమే. ఈ నేపథ్యంలో ఐఐటీ పరిశోధకులు వెదురుతో ఫర్నిచర్‌ను డిజైన్ చేశారు. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చాక వీటిని పారేయవచ్చని వారు వివరించారు. ఈ డిజైన్ సాయంతో రోజుకు 200కుపైగా పడకలను తయారుచేయవచ్చని పేర్కొన్నారు.