తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.650కే కరోనా టెస్టింగ్ కిట్!

దేశంలో కొవిడ్​ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో కరోనా పరీక్షలు చేసేలా కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది దిల్లీ ఐఐటీ విద్యార్థుల బృందం. ఓ ప్రైవేటు సంస్థ ద్వారా రూ.650కే ఈ కిట్​ను విక్రయించనుంది.

By

Published : Jul 15, 2020, 7:36 PM IST

Updated : Jul 15, 2020, 7:43 PM IST

IIT Delhi launches "Corosure" claimed to be the world's most affordable diagnostic kit for corona
రూ.650కే కరోనా టెస్టింగ్ కిట్!

తక్కువ ఖర్చుతో కరోనా పరీక్ష చేసే కొత్త విధానాన్ని దిల్లీ ఐఐటీ విద్యార్థుల బృందం అభివృద్ధి చేసింది. 'కరోష్యూర్‌'గా పిలిచే ఈ కిట్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ నిశాంక్‌, మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రేతో కలిసి బుధవారం విడుదల చేశారు.

ఈ కిట్‌ అందుబాటులోకి రావడాన్ని చారిత్రక సందర్భంగా అభివర్ణించారు మంత్రి. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ఆర్‌టీ-పీసీఆర్‌ (రియల్‌టైమ్‌-పీసీఆర్) ఆధారిత కరోనా పరీక్షల కిట్‌ను రూపొందించిన తొలి విద్యాసంస్థగా ఐఐటీ దిల్లీ నిలిచిపోతుందని ప్రశంసించారు.

రూ.650కే

నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ ఓపెన్‌ లెసెన్స్ ద్వారా కరోష్యూర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీలకు వాణిజ్య అనుమతులు మంజూరు చేసినట్లు ఐఐటీ దిల్లీ తెలిపింది. న్యూటెక్‌ మెడికల్ డివైజెస్‌ అనే సంస్థ ఈ కిట్‌ను రూ.650కి మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

"ఈ కిట్ అందుబాటులోకి రావడం వల్ల దేశంలో కరోనా పరీక్షల్లో కీలక మార్పులు రానున్నాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్‌ఆర్), డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఈ కిట్‌తో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేశాయి. న్యూటెక్‌ మెడికల్ డివైజెస్... ఐఐటీ దిల్లీ టెక్నాలజీతో అతి తక్కువ ఖర్చుతో నెలకు 20 లక్షల పరీక్షలు చేస్తుంది."

-వి.రాంగోపాల్ రావు, దిల్లీ ఐఐటీ డైరెక్టర్‌

ప్రస్తుతం మార్కెట్లో ప్రోబ్‌-బేస్డ్‌ పరీక్షా విధానం అందుబాటులో ఉందని, కానీ తాము రూపొందించిన కిట్‌తో ప్రోబ్‌-ఫ్రీ విధానం ద్వారా పరీక్షలు చేయవచ్చని, దీని వల్ల పరీక్షలు చేసేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుందని, అలానే ఫలితాల్లో కచ్చితత్వంలో ఎలాంటి రాజీ ఉండదని ఐఐటీ దిల్లీ తెలిపింది.

Last Updated : Jul 15, 2020, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details