చౌకగా కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేసేందుకు దిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పరిశోధకులు టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేశారు. 3 నెలల పాటు శ్రమించి ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కిట్‌కు భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నుంచి ఆమోదం కూడా లభించింది.
మేము జనవరి చివరి నాటికి ఈ పరికరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభించాం. చాలా తక్కువ ధరలో ఎక్కువ మందికి సాయపడాలనే ఉద్దేశంతో మేము ఈ కిట్‌ను తీసుకొచ్చాం.
-వి. పెరుమాళ్, దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్
దిల్లీలోని ఐఐటీ కుసుమా స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్(కేఎస్బీఎస్) పరిశోధకులు ఈ కిట్‌ను అభివృద్ధి చేశారు. రియల్ టైమ్ పీసీఆర్ బేస్డ్ డయాగ్నొస్టిక్ పరీక్షల కోసం ఐసీఎంఆర్ అనుమతి పొందిన తొలి విద్యా సంస్థ దిల్లీ ఐఐటీ కావడం విశేషం. తాము రూపొందించిన విధానంపై నిర్వహించిన పరీక్షల్లో వంద శాతం కచ్చితత్వం వచ్చిందని ఐఐటీ పేర్కొంది.
వీలైనంత త్వరగా పారిశ్రామిక భాగస్వాములతో కలిసి.. పెద్ద మెత్తంలో కిట్లను తయారు చేసి తక్కువ ధరకే అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది పరిశోధన బృందం.