ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేత, ఉన్నావ్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో... సన్యాసినైన తనకు ఓటేయకపోతే పాపం తలుగుతుందని హెచ్చరించారు.
'నాకు ఓటేయకుంటే పాపం తగులుతుంది' - ఉత్తరప్రదేశ్
భాజపా నేత సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సన్యాసైన తనకు ఓటేయకపోతే పాపం తగులుతుందన్నారు.
"నాకు ఓటేయకుంటే పాపం తగులుతుంది"
"నేనో సన్యాసిని. మీ ఇంటికి వచ్చాను. ఓ సన్యాసి మీ ఇంటికొచ్చి భిక్ష, ఇంకా ఏమైనా అడిగినప్పుడు.... వాటిని మీరు దానం చేయనట్లయితే ఆయన వెంట మీ పుణ్యాన్ని తీసుకెళ్తారు. మీకు పాపం తలుగుతుంది. ఇది శాస్త్రాల్లో రాసి ఉంది. నేను అదే చెబుతున్నాను. కాబట్టి నేను డబ్బులు, వస్తువులు, భూమి లాంటివి అడగటానికి రాలేదు. 125 కోట్ల మంది దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఓటు అడుగుతున్నాను. " - సాక్షి మహరాజ్, ఉన్నావ్ ఎంపీ, భాజపా.
Last Updated : Apr 13, 2019, 5:48 PM IST