తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ.. ధైర్యముంటే హాంకాంగ్​​ గురించి మాట్లాడండి' - manish tewari

భారత్​ అంతర్గత విషయాలలో తలదూర్చకుండా చైనాను అడ్డుకోవడంలో మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం కశ్మీర్​ పరిస్థితులను గమనిస్తున్నామని చైనా చెబుతోన్నా.. భాజపా ప్రభుత్వం డ్రాగన్​ దేశం వద్ద హాం​కాంగ్​ గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శనాస్త్రాలు గుప్పించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి మనీశ్​ తివారీ.

'మోదీ.. ధైర్యముంటే హాంగ్​కాంగ్​ గురించి మాట్లాడండి'

By

Published : Oct 10, 2019, 8:09 PM IST

Updated : Oct 10, 2019, 8:20 PM IST

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం కశ్మీర్​లో పరిస్థితులను ఎప్పటికప్పుడు చైనా గమనిస్తోందని ఆ దేశాధ్యక్షుడు షీ జిన్​పింగ్​ పదేపదే చెబుతూనే ఉన్నారు. అయితే చైనా అధ్యక్షుడి వ్యాఖ్యలపై తాజాగా మోదీ ప్రభుత్వాన్నివిమర్శించింది హస్తం పార్టీ. కశ్మీర్​ను గమనిస్తున్నామని జిన్​పింగ్​ చెబుతుంటే... భాజపా సర్కారు హాం​కాంగ్​ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. హాం​కాంగ్​లో చైనాకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్​ కూడా హాం​కాంగ్​ను గమనిస్తోందని జిన్​పింగ్​కు మోదీ సర్కారు ఎందుకు చెప్పలేకపోతోందని విమర్శించింది.

భారత్​ అంతర్గత విషయాలలో చైనా తలదూర్చకుండా అడ్డుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్​ తివారీ ఆరోపించారు.

మనీశ్ తివారీ ట్వీట్

"కశ్మీర్​ను గమనిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ చెబుతున్నారు. అయితే హాం​కాంగ్​లో జరుగుతున్న ప్రజా నిరసనలు, జింజియాంగ్​లో మానవహక్కుల ఉల్లంఘన, దక్షిణ చైనా సముద్రం, టిబెట్​లో జరుగుతున్న అణచివేత వంటి విషయాలను తాము కూడా గమనిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ ఎందుకు చెప్పడం లేదు."
- మనీశ్ తివారీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ఆక్సాయిచిన్ గురించి మాట్లాడండి

అలాగే మోదీ సర్కారుకు ధైర్యముంటే.. పాక్​ అక్రమంగా చైనాకు అప్పగించిన అక్సాయిచిన్​ గురించి జిన్​పింగ్​తో మాట్లాడాలని తివారీ ట్వీట్​ చేశారు.

మనీశ్ తివారీ ట్వీట్

"పాక్​ ఆక్రమిత కశ్మీర్​, గిల్గిట్-బాల్టిస్థాన్​ను తిరిగి చేజిక్కించుకోవడంపై భాజపా నేతలందరు గొప్పగా మాట్లాడుకుంటున్నారు, కానీ 1963లో పాకిస్థాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన ఆక్సాయిచిన్​ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంపై ఒక్కరూ మాట్లాడటం లేదు. ఆక్సాయిచిన్ తిరిగి తీసుకోవడంపై జిన్​పింగ్​తో ప్రధాని మోదీ మాట్లాడతారా?"
-కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ

Last Updated : Oct 10, 2019, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details