తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీజీ... ఇలా అయితే ఆగ్రహ జ్వాల తప్పదు'

దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను ఉద్దేశించి కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం పెరిగి ఆదాయం తగ్గితే విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు నెలకొంటాయన్నారు.

If unemployment rises and incomes decline, youth may explode in anger: Chidambaram
'నిరుద్యోగం పెరిగితే.. విద్యార్థులో ఆగ్రహావేశాలు తప్పవు'

By

Published : Jan 14, 2020, 10:41 AM IST

దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగం పెరిగి, ఆదాయం తగ్గితే యువత, విద్యార్థుల్లో ఆగ్రహజ్వాలలు ఎగిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019 డిసెంబరులో రిటైల్​ ద్రవ్యోల్బణం 7.35 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలో పెరుగతున్న ద్రవ్యోల్బణంపై చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు.

చిదంబరం ట్వీట్​

"దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్​ఆర్​సీపై నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ, ఎన్​ఆర్​సీ వల్ల ప్రమాదం పొంచి ఉందని ఈ నిరసనల చూస్తే అర్థమవుతోంది. ఆర్థిక మందగమనం ప్రధాన సమస్య. నిరుద్యోగం పెరిగి, ఆదాయం తగ్గితే.. యువత, విద్యార్థులు ఆగ్రహిస్తారు."

- చిదంబరం, కాంగ్రెస్​ సీనియర్​ నేత

ఉల్లి ధరలు ఆకాశానంటుతున్నాయన్న చిదంబరం.. భాజపా హామీనిచ్చిన మంచి రోజులు(అచ్ఛే దిన్​) ఇవేనా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: భారత్​ జవాన్లపై బంగ్లా సైన్యం కాల్పులు- ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details