దాదాపు రెండు నెలల విరామం తర్వాత సాధారణ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. జూన్ 1 నుంచి రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 200 సర్వీసులను నడపనుంది. ఇప్పటికే వీటికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ ప్రయాణాల విషయంలో కొన్ని నిబంధనలు పెట్టింది.
జూన్ 1న రైలు ఎక్కుతున్నారా?.. ఇవి పాటించాల్సిందే - TRAINS START JUNE
దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రైళ్ల ప్రయాణానికి అనుమతులిచ్చింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే జూన్ 1 నుంచి 200 రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రయాణ విషయంలో కొన్ని నిబంధనలు విధించింది. అవేంటో తెలుసుకుందామా?
జూన్ 1న రైలు ఎక్కుతుంటే.. ఇవి పాటించాల్సిందే
రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెట్టబోయే వ్యక్తికి ఈ మార్పులు కొత్తగా అనిపించొచ్చు. టికెట్ బుకింగ్ మొదలుకొని రైల్వే స్టేషన్‌కు చేరుకోవడం, స్క్రీనింగ్, రైళ్లో ఆహారం, ప్రయాణంలో చేయాల్సినవి, చేయకూడనవి అంటూ కొన్ని మార్గదర్శకాలను రైల్వేశాఖ విడుదల చేసింది. ఒకవేళ మీరు గానీ, మీ సన్నిహితులు గానీ త్వరలో రైలు ప్రయాణానికి సన్నద్ధమవుతుంటే ఈ గైడ్‌లైన్స్‌పై ఓ లుక్కేయండి.