తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాలాగే పాక్​తోనూ చర్చలు జరపాలి: ఫరూక్​ - If talks can happen with China, why not with other neighbour: Abdullah in LS

ఆర్టికల్​ 370 రద్దు సమయంలో నిర్బంధం తర్వాత ఇటీవలే బయటకొచ్చిన జమ్ముకశ్మీర్ మాజీ​ సీఎం ఫరూక్​ అబ్దుల్లా.. పార్లమెంటులో ప్రసంగించారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా పాక్​, చైనా అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా తరహాలోనే పాకిస్థాన్​తోనూ సరిహద్దు సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని సూచించారు.

If talks can happen with China, why not with other neighbour: Abdullah in LS
చైనాలాగే పాక్​తోనూ చర్చించాలి: ఫరూక్​ అబ్దుల్లా

By

Published : Sep 19, 2020, 10:48 PM IST

Updated : Sep 19, 2020, 11:03 PM IST

భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న వివాదాలకు.. చర్చల ద్వారా తెర దించాలని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లా అన్నారు. నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత శనివారం తొలిసారి లోక్​సభలో ప్రసంగించారు.

"చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించేందుకు ఆ దేశంతో చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నాం. భారత, పాక్‌ సరిహద్దుల విషయంలోనూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. అవి పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండటం వల్ల ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో ఒక్క చైనాతోనే కాకుండా.. పాకిస్థాన్‌తో కూడా చర్చలు చేపట్టి వివాదాల్ని తొలగించే దిశగా ప్రయత్నించాలి"

-- ఫరూక్​ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి

షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌ విషయంలో ఆర్మీ అధికారులు విచారణకు ఆదేశించడంపై ఫరూక్​ సంతోషం వ్యక్తం చేశారు. షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని.. ఆశాభావం వ్యక్తం చేశారు. జులైలో షోపియాన్​లో సైనికులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ విషయమై విచారణ చేపట్టిన అధికారులు సైనికులు తమ అధికారాలను అధిగమించడం వల్లే ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలిపారు. వారిపై క్రమశిక్షణ చర్యలకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో శాంతి భద్రతల చట్టం కింద మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలువురు నాయకుల్ని నిర్బంధంలో ఉంచారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత విడుదల చేశారు.

ఇదీ చూడండి: చైనాతో ఉద్రిక్తతలపై కేంద్రం సమగ్ర సమీక్ష

Last Updated : Sep 19, 2020, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details