పోలీసులు చట్టాన్ని అమలుచేయడంలో విఫలమైతే, ప్రజాస్వామ్యం కుప్పకూలుతుందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ అన్నారు. బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువ పోలీసు సూపరింటెండెంట్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
"చట్టాన్ని రూపొందించడం ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైన పని. మీరు (పోలీసు సిబ్బంది) ఆ చట్టాన్ని అమలు చేసేవారు. మీరు విఫలమైతే ప్రజాస్వామ్యం కూడా విఫలమవుతుంది."- అజిత్ డోభాల్, జాతీయ భద్రతా సలహాదారు