తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా విఫలమయితే కాంగ్రెస్​తో కలిసి సాధిస్తాం' - భాజపా శివసేన తాజా వార్తలు

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి రావొద్దని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్​తో కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు జైపుర్​లో ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.

నవాబ్ మాలిక్, ఎన్సీపీ నేత

By

Published : Nov 10, 2019, 2:34 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఎన్సీపీ నేత నవాబ్​ మాలిక్. భాజపా-శివసేన కూటమి విఫలమయితే కాంగ్రెస్​తో కలిసి ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకుండా ఎవరో ఒకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

నవాబ్ మాలిక్, ఎన్సీపీ నేత

"శివసేన-భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే విపక్షంలో కూర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్-ఎన్సీపీ ప్రయత్నిస్తుంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రావటానికి వీల్లేదు. మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు భారంగా మారుతుంది. అందుకే ప్రత్యామ్నాయ అవకాశాలపై చర్చించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలతో త్వరలో భేటీ అయి రాష్ట్ర పరిస్థితులపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం."

-నవాబ్ మాలిక్, ఎన్సీపీ నేత

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఖర్గే భేటీ..

జైపుర్​లోని రిసార్టు​లో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి వైఖరిని అవలంబించాలనే అంశంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన సంచలన వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details