తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామాలో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ స్వాధీనం - jammu kashmir latest news

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో పెను ప్రమాదం తప్పింది. ఉగ్రవాదాలు ఏర్పాటు చేసిన ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది. ముష్కురులు ఓ వంతెన కింద దీనిని అమర్చినట్లు తెలిపారు.

IED recovered in J&K's Pulwama, major tragedy averted
పుల్వామాలో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ స్వాధీనం

By

Published : Aug 17, 2020, 11:26 AM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలోని తుజన్​ గ్రామంలో ఓ వంతెన కింద ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

కశ్మీర్​లో భద్రతా దళాల వాహనాలే లక్ష్యంగా ముష్కురులు రోడ్లు, రహదారుల వెంబడి ఐఈడీలు అమర్చుతున్నట్లు పోలీసులు తెలిపారు. తాజా ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను పటిష్ఠం చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా చర్యలు చేపట్టారు. స్నిఫర్​ డాగ్స్, ఎలక్ట్రానిక్​ పరికరాలతో రోడ్లు, రహదారుల వెంబడి ముమ్మర తనిఖీలు చేపట్టారు.

ఈ నెల మొదట్లోనూ బారాముల్లా జిల్లా పత్తన్​ ప్రాంతంలో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని గుర్తించి నిర్వీర్యం చేశాయి భద్రతా దళాలు. పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న దీనిని 29వ రాష్ట్రీయ రైఫిల్స్ స్వాధీనం చేసుకుంది.

ఇదీ చూడండి: 'బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా పరార్​'

ABOUT THE AUTHOR

...view details