తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వయంగా మోదీజీ విమర్శించినా స్వాగతిస్తా: పాసవాన్​ - చిరాగ్​ పాసవాన్​ భాజపా

భాజపా నేతలు విమర్శించినప్పటికీ.. ప్రధాని మోదీని తాను అభిమానిస్తూనే ఉంటానని ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​ వెల్లడించారు. మోదీని తాను ఎందుకు గౌరవించకూడదని ప్రశ్నించారు. ఎల్​జేపీ- భాజపా మధ్య విభేదాలున్నట్టు చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

I'd like to allay this fear by saying that I welcome criticism from BJP leaders, even from PM: Chirag Paswan, LJP
భాజపా విమర్శలను స్వాగతిస్తున్నా: పాసవాన్​

By

Published : Oct 18, 2020, 12:21 PM IST

తనపై భాజపా నేతలు చేస్తున్న విమర్శలను స్వాగతిస్తున్నట్టు ఎల్​జేపీ(లోక్​ జన్​శక్తి పార్టీ) అధినేత చిరాగ్​ పాసవాన్​ వెల్లడించారు. స్వయంగా మోదీ విమర్శించినా అలానే స్వీకరిస్తానన్నారు. అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని వదులుకోనని స్పష్టం చేశారు. తన తండ్రి రామ్​ విలాస్​ పాసవాన్​ ఐసీయులో ఉన్నప్పుడు.. తనకు మోదీ మద్దతుగా నిలిచారన్నారు. మోదీని ఎందుకు గౌరవించకూడదని ప్రశ్నించారు.

ఎల్​జేపీ-భాజపా మధ్య విభేదాలున్నట్టు చిత్రీకరించడానికి ముఖ్యమంత్రి నితీశ్​ కుమర్​ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు చిరాగ్​. అయితే.. నితీశ్​ తనను తాను ప్రజలకు దూరం చేసుకుంటున్నారని విమర్శించారు. యువ నేతలకు అనుభవం లేదని నితీశ్​​ కొట్టిపారేస్తున్నారని... ఒకప్పుడు ఆయన కూడా అక్కడి నుంచే ఎదిగారని ఎల్​జేపీ అధ్యక్షుడు అన్నారు. నితీశ్​కు ప్రజలు 15 ఏళ్ల పాటు అవకాశమిచ్చారని.. బిహార్​ అభివృద్ధికి తాము కూడా కృషి చేయగలతామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-'నా గుండెలు చీల్చి చూడండి.. మోదీ కనిపిస్తారు'

ABOUT THE AUTHOR

...view details