తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సమాచార హక్కు చట్టం ఇక కోరల్లేని పులే'

సమాచార హక్కు చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలపై విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ బిల్లు సమాచార హక్కు చట్టం స్వతంత్రతను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Jul 22, 2019, 8:25 PM IST

'సమాచార హక్కు చట్టం ఇక కోరల్లేని పులే'

ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు, చట్టాలు సహా పలు విషయాలపై దేశ పౌరులు సమాచారం తెలసుకునేందుకు రూపొందించిందే సమాచార హక్కు చట్టం. ఆర్​టీఐ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. అయితే బిల్లులో ప్రతిపాదించిన సవరణలపై సభలో విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచార కమిషనర్ల అధికారాలను ఈ బిల్లు హరిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఆర్​టీఐ వ్యవస్థను బలహీన పరిచేందుకే ఇలాంటి సవరణలు ప్రతిపాదించారని కాంగ్రెస్​ సభ్యుడు శశిథరూర్​ ఆరోపించారు.

ఆర్​టీఐ చట్ట సవరణపై మాట్లాడుతున్న శశిథరూర్​

"ఈ ఆర్​టీఐ సవరణ.. చట్ట రూపాన్ని బలహీనపరిచేందుకు ఓ ప్రయత్నం. మానవ హక్కుల కమిషన్​లానే ఆర్​టీఐను కూడా కోరలు లేని పులిలా తయారు చేస్తున్నారు. ఇది కేవలం ఆర్​టీఐ సవరణ బిల్లు కాదు... ఆర్​టీఐను భూస్థాపితం చేసే బిల్లు."
- శశిథరూర్​, కాంగ్రెస్​ ఎంపీ

రాజ్యసభలో...

మానవ హక్కుల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఉన్న చట్టంలోని కీలక అంశాలను సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు విపక్షాలు అభ్యంతరం తెలిపినా సభ అంగీకారం తెలిపింది.

బిల్లులోని అంశాలు..

  1. మానవ హక్కుల కమిషన్​ ఛైర్మన్​ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి మూడేళ్లకు కుదింపు
  2. కమిషన్​ ఛైర్మన్​గా భారత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీం విశ్రాంత న్యాయమూర్తులనూ నియమించవచ్చు.
  3. రాష్ట్రాల కమిషన్​లోనూ హైకోర్టు న్యాయమూర్తులను నియమించవచ్చు.
  4. కమిషన్​లో సభ్యుల సంఖ్య పెంపు

ABOUT THE AUTHOR

...view details