దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ పరీక్షల సామర్థ్యాన్ని పెంపొందించే అంశంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేశాయి కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్. ఈ మేరకు స్వల్ప, మధ్యకాలిక పద్ధతులతో కూడిన సలహాలను వివరిస్తూ సంయుక్తంగా లేఖ రాశాయి.
"ల్యాబ్లను పెంచడం వల్ల కరోనా పరీక్షల సామర్థ్యం పెరుగుతుంది. ఈ మేరకు దేశంలో కరోనా పరీక్షలను విస్తరించేందుకు ఓ వ్యూహాన్ని రచించారు. దీనికి రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వలు, ఐసీఏఆర్, డీబీటీ, డీఎస్టీ సహా ఇతర సంస్థల మధ్య సమన్వయం ఉండటం ఎంతో ముఖ్యం."
-- కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ సంయుక్త లేఖ