కరోనా వైరస్ నిర్ధరణ పరీక్ష విధానాల్లో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పలు మార్పులు చేసింది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం..
- విదేశాల నుంచి వచ్చినవారు, వలస కార్మికులకు ఫ్లూ లక్షణాలు ఉంటే 7 రోజుల్లోగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలి
- ఫ్లూ లక్షణాలు ఉండి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరీక్షించాలి.
- తీవ్ర శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు టెస్టులు చేయాలి
- కంటైన్మెంట్ జోన్లలో తీవ్ర అస్వస్థతకు గురైన వాళ్లకు పరీక్షలు జరపాలి.
- కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఆర్టీ-పీసీఆర్ ద్వారా వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలి.
- పాజిటివ్ వ్యక్తులతో అత్యంత సన్నిహితంగా మెలిగినవారిలో వైరస్ సోకే అవకాశం ఉండేవారిని 5 నుంచి 10 రోజుల మధ్యలో ఒకసారి కచ్చితంగా పరీక్షించాలి.
- సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో లక్షణాలు లేకున్నా 5 నుంచి 14 రోజులలోపు పరీక్ష నిర్వహించాలి.
- ఎలాంటి సమస్యలు ఉన్నా కరోనా పరీక్షలు నిర్వహించటంలో ఆలస్యం చేయకూడదు.
ఫ్లూ లక్షణాలు..