తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కరోనా వైరస్​ రూపాంతరం చెందుతోందా? - covid-19 latest news

దేశంలో రెండు నెలలుగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ఇతర రూపాల్లోకి మార్పు చెందిందా అనే విషయంపై పరిశోధన చేపట్టనుంది భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) . లాక్​డౌన్​ పూర్తిగా ముగిసిన అనంతరం అధ్యయనం ప్రారంభించనుంది.

ICMR plans to study
దేశంలో కరోనా వైరస్​ రూపాంతరం చెందుతోందా?

By

Published : May 2, 2020, 8:31 PM IST

కరోనా వైరస్ ఇతర రూపాల్లోకి మార్పులు చెందిందో లెదో తెలుసుకునేందుకు పరిశోధలను చేపట్టున్నట్లు తెలిపింది భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​). దేశంలో కరోనా వ్యాప్తి చెంది రెండు నెలలు కావస్తున్నందున ఈ విషయంపై అధ్యయనం చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం అనేక మంది వైరస్​ సోకిన వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించాలి. అన్ని రాష్ట్రాల్లో రవాణపై ప్రస్తుతం ఆంక్షలు ఉన్నందున దేశవ్యాప్త లాక్​డౌన్​ పూర్తిగా ముగిసిన తర్వాతే పరోశోధన ప్రారంభించనున్నట్లు ఐసీఎంర్​ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

వైరస్ రూపాంతరం చెందిందో లేదో తెలిస్తే సమర్థమైన టీకాను అభివృద్ధి చేసేందుకు ఇది దోహదపడుతుందని సీనియర్ పరిశోధకులు చెప్పారు. వైరస్​కు​ మరింత వ్యాప్తి చెందే సామర్థ్యం ఉందా? అనే విషయంపైనా స్పష్టత వస్తుందని వివరించారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోని కరోనా వైరస్‌లో 0.2 నుంచి 0.9 శాతమే బేధం ఉందని ఇన్‌ఫ్లూయెంజా సమాచారాన్ని పంచుకొనే అంతర్జాతీయ వేదిక (జీఐఎస్‌ఏఐడి) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 7000 జన్యు పరివర్తన క్రమాలను ఇది ఆవిష్కరించింది.

విదేశాల నుంచే అధికం

విదేశాల నుంచి వస్తున్న ప్రజల వల్లే భారత్‌లో వేర్వేరు వైరస్‌ స్ట్రెయిన్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో మూడు రకాల వైరస్‌ను గుర్తించారు. ఇవి వుహాన్‌, ఇటలీ, ఇరాన్‌కు చెందినవి. ఇరాన్‌ జన్యు పరివర్తన క్రమం దాదాపుగా చైనాకు సారూప్యంగా ఉంది.

‘దేశంలోని కరోనా వైరస్‌ పాక్షిక జాతులను తెలుసుకొనేందుకు కొంత సమయం పడుతుంది. అయితే ఉత్పరివర్తనాలు వ్యాక్సిన్లను అసమర్థంగా మార్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే అన్ని వైరస్‌ ఉప జాతుల్లోనూ ఒకేరకం ఎంజైములు ఉంటాయి. భారత్‌లో వైరస్‌ ప్రవేశించి మూడు నెలలే అయింది. కాబట్టి అంత వేగంగా ఉత్పరివర్తనం ఉండదు’ అని ఐసీఎంఆర్‌ చీఫ్‌ డాక్టర్‌ రామన్‌ ఆర్‌ గంగాఖేడ్కర్‌ గతంలో అన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఆరు సంస్థలు వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details