యాంటిజెన్ నిర్ధరణ పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరికొన్ని సిఫార్సులను జారీ చేసింది. ఫలితం నెగిటివ్ వచ్చినప్పుడు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తో కలిపి స్టాండర్డ్ క్యూ కొవిడ్- 19 యాంటిజెన్ నిర్ధరణ పరీక్ష నిర్వహించాలని సూచనలు చేసింది.
ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల ద్వారా నెగిటివ్ వస్తే.. వారి శాంపిళ్లను మళ్లీ ఆర్టీ- పీసీఆర్ ద్వారా నిర్ధరించాలని స్పష్టం చేసింది ఐసీఎంఆర్. పాజిటివ్ వచ్చినట్లయితే కరోనా సోకినట్లు ధ్రువీకరించాలని, అప్పుడిక ఆర్టీ-పీసీఆర్ అవసరం లేదని పేర్కొంది.
స్టాండర్డ్ క్యూ యాంటిజెన్ నిర్ధరణలో టెస్టింగ్ కిట్‌కు శాంపిల్‌ను అందించగానే గరిష్ఠంగా 30 నిమిషాల్లో ఫలితాన్ని వెల్లడిస్తుంది. ఈ కిట్‌ను 2-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. దీనికి అధిక సున్నితత్వం ఉన్న నేపథ్యంలో ఆర్టీ-పీసీఆర్‌తో కొన్ని సెట్టింగ్ కాంబినేషన్లతో కలిపి ధ్రువీకరించాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ స్ఫష్టం చేసింది. ఏయే సందర్భాల్లో దీనిని అనుసరించాలో వివరణ ఇచ్చింది.
ఏ. కంటెన్మెంట్ జోన్ లేదా హాట్‌స్పాట్
వీరికి నిర్బంధ వైద్య పర్యవేక్షణ ఉండాలి. కిట్ ఉష్ణోగ్రత 2-30 డిగ్రీల సెల్సియస్ మధ్య స్టోర్ చేయాలి.
- ఇన్‌ఫ్లూయెంజా తరహా అనారోగ్య లక్షణాలు కనిపించిన వారికి పరీక్ష చేయాలి.
- లక్షణాలు లేకున్నా.. పాజిటివ్ కేసులతో సన్నిహితంగా ఉన్న (ఇప్పటికే ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, మూత్ర పిండాల, డయాబెటిస్, నరాలు, రక్త హీనత వంటి సమస్యలతో బాధపడుతున్న)వారికి 5 నుంచి 10 రోజుల్లో పరీక్ష నిర్వహించాలి.
బీ. హెల్త్ కేర్ సెట్టింగ్స్
- ఆరోగ్య సంరక్షణ విభాగంలో పనిచేస్తున్నవారిలో ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు కనిపించినా, వారికి కరోనా సోకినట్లు అనుమానం కలిగినా..
- ఆసుపత్రిలో చేరి లక్షణాలు లేకపోయినా, కీమోథెరపీ, హెచ్ఐవీ పాజిటివ్, అవయమ మార్పిడి, వృద్ధులు, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారు..
- శస్త్ర చికిత్స చేయించుకున్నవారిలో లక్షణాలు లేకపోయినా యాంటిజెన్‌తో కలిపి నిర్ధరించాలి.