In a letter to Bharat Biotech, the ICMR has demanded fast track method of the COVID-19 vaccine 'Covaxin' so that results of a clinical trial can be launched by August 15.
కరోనా వైరస్‌కు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాక్జిన్‌ను ఆగస్టు 15 కల్లా విడుదల చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి పరీక్షలను వేగవంతం చేయాలని భారత్ బయోటెక్‌తోపాటు సంబంధిత వైద్య కళాశాలకు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ లేఖ రాశారు.
ఇందుకోసం భారత్ బయోటెక్‌తో కలిసి పనిచేయనున్నట్టు బలరాం పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యాక్సిన్ విడుదల ప్రాథమిక అంశంగా పరిగణించాలని, ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములందరికీ తెలియజేశారు బలరాం.
సన్నద్ధమవ్వాలి..
భారత్ బయోటెక్‌తో పాటు ఎంపిక చేసిన కేంద్రాలు క్లినికల్ ట్రయల్స్‌కు సన్నద్ధమవ్వాలని సూచించారు భార్గవ. త్వరితగతిన ట్రయల్స్‌ను పూర్తి చేసి, ఫలితాల వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యాక్సిన్ కరోనాను నివారించగలిగితే ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి త్వరగా తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
ఐసీఎంఆర్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. కొవాక్జిన్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతితో క్లినికల్ ట్రయల్స్‌ను జులై నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది భారత్ బయోటెక్.
సవాళ్లతో కూడుకున్న పనే!
కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తున్నా... ఆచరణసాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఈ ఏడాది చివరినాటికి మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
10:03 July 03
ఆగస్ట్ 15 కల్లా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు
భారత్ బయోటెక్‌కి ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ లేఖ
భారత్ బయోటెక్‌తో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొన్న ఐసీఎంఆర్
వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ వేగవంతానికి భారత్ బయోటెక్‌తో పనిచేయనున్నట్లు వెల్లడి
కరోనా వైరస్ నివారణ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న భారత్ బయోటెక్
ఐసీఎంఆర్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో వ్యాక్సిన్ రూపకల్పన
వ్యాక్సిన్ విడుదల ప్రాథమిక అంశంగా పరిగణించబడుతుందన్న ఐసీఎంఆర్
భారత్ బయోటెక్ రూపొందించిన కొవాక్జిన్కు వేగవంతమైన క్లినికల్ ట్రయల్స్
డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతితో కొవాక్జిన్కు క్లినికల్ ట్రయల్స్
కొవాక్జిన్ క్లినికల్ టెస్ట్స్‌లో విజయవంతమైతే ఆగస్ట్ 15 కల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయాలని భావిస్తున్న ICMR, భారత్ బయోటెక్.
మనుషులలో కొవాక్జిన్ పరీక్షలు విజయవంతమైతే కరోనాపై సమర్థవంతమైన వ్యాక్సిన్‌గా నిలువనున్న కొవాక్జిన్.