తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో తీర్పు జులై 17న

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్​లో జైలు జీవితం గడుపుతున్న కుల్​భూషణ్​ జాదవ్ కేసులో జులై 17న తీర్పు వెలువరించనుంది అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ భారత నావికాదళ మాజీ అధికారిని 2016లో పాక్​ ఏజెంట్లు అపహరించారు.

By

Published : Jul 5, 2019, 5:01 AM IST

Updated : Jul 5, 2019, 7:37 AM IST

కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో త్వరలోనే తీర్పు...

కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో తీర్పు జులై 17న

భారత నావికాదళ మాజీ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ కేసు తీర్పును జులై 17న వెల్లడించనుంది అంతర్జాతీయ న్యాయస్థానం. ది హేగ్​లోని పీస్​ ప్యాలెస్​లో మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు వెలువరించనున్నారు న్యాయమూర్తి అబ్దుల్ఖవీ అహ్మద్​ యూసుఫ్​.

గూఢచర్యం ఆరోపణలతో 2016లో కుల్‌భూషణ్‌ జాదవ్‌ను ఇరాన్‌లో పాక్‌ ఏజెంట్లు అపహరించారు. ఆ తర్వాత బలూచిస్థాన్​లో ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది.

అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్​...

అనంతరం ఈ అంశంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్‌ అపహరించిందని భారత్‌ తెలిపింది. పాక్‌ విధించిన మరణశిక్షను సవాల్​ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది​. 2017 మే 18న ఆయన‌ మరణశిక్షపై స్టే విధించింది కోర్టు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది.

Last Updated : Jul 5, 2019, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details