తెలంగాణ

telangana

ETV Bharat / bharat

8 గంటలపాటు కొచ్చర్​ను విచారించిన ఈడీ

ఐసీఐసీఐ బ్యాంకు- వీడియోకాన్​ రుణ మంజూరు కేసులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందా కొచ్చర్​, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ సోమవారం​ ప్రశ్నించింది. 8 గంటల పాటు సాగిన విచారణ అనంతరం మనీలాండరింగ్​ కేసులో వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. నేడు మరోమారు విచారించే అవకాశముంది.

8 గంటలపాటు కొచ్చర్​ను విచారించిన ఈడీ

By

Published : May 14, 2019, 5:32 AM IST

Updated : May 14, 2019, 8:03 AM IST

8 గంటలపాటు కొచ్చర్​ను విచారించిన ఈడీ

ఐసీఐసీఐ బ్యాంక్​ మాజీ ప్రధాన కార్యనిర్వహణాధికారి చందాకొచ్చర్​, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ సోమవారం విచారించింది. సుమారు 8 గంటల పాటు వారిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అక్రమ నగదు బదిలీ నివారణ చట్టం (పీఎమ్​ఎల్​ఏ) కింద వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. మంగళవారమూ విచారణ కొనసాగే అవకాశముంది.

కేసు విచారణలో భాగంగా ఈ నెల మొదటి వారంలోనే హాజరు కావాలని ఈడీ ఆదేశించినప్పటికీ.. కొంత సమయం కావాలని వారు కోరారు. కొచ్చర్​ దంపతుల వినతిని అంగీకరించిన ఈడీ... సోమవారం విచారణ జరిపింది.

ఈ కేసుకు సంబంధించి కొద్ది రోజుల ముందే చందా కొచ్చర్​ మరిది, సింగపూర్​ ఆధారిత అవిస్టా అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్​ కొచ్చర్​ను ఈడీ ప్రశ్నించింది.

మార్చి 1న సోదాలు

మార్చి 1న కొచ్చర్​, వీడియోకాన్​ ప్రతినిధి వేణుగోపాల్​ నివాసాలు సహా ముంబయి, ఔరంగాబాద్​లోని కార్యాలయాల్లో సోదాలు జరిపింది ఈడీ. అనంతరం వీడియోకాన్​కు అక్రమ మార్గంలో రూ.1875 కోట్ల రుణాన్ని మంజూరు చేశారని ఆరోపిస్తూ చందాకొచ్చర్​, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​, వేణుగోపాల్​పై కేసు నమోదు చేసింది.

Last Updated : May 14, 2019, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details