తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండో రోజు ఈడీ ముందుకు చందా కొచ్చర్​ - ఐసీఐసీఐ

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్​ వరుసగా రెండో రోజు ఈడీ ముందు హాజరయ్యారు. ఐసీఐసీఐ- వీడియోకాన్​ అక్రమ రుణ మంజూరు కేసుపై అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

రెండో రోజు ఈడీ ముందుకు చందా కొచ్చర్​

By

Published : May 14, 2019, 2:24 PM IST

ఐసీఐసీఐ బ్యాంకు- వీడియోకాన్​ రుణ మంజూరు కేసులో ఆ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. కొచ్చర్​తో పాటు ఆమె భర్త కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు.

సోమవారం వీరిద్దరిపై సుమారు 8 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. మనీలాండరింగ్​ కేసులో వారి వాంగ్మూలాలు నమోదు చేశారు.

రెండో రోజు ఈడీ ముందుకు చందా కొచ్చర్​

కేసు విచారణలో భాగంగా ఈ నెల మొదటి వారంలోనే హాజరు కావాలని ఈడీ ఆదేశించినప్పటికీ.. కొంత సమయం కావాలని వారు కోరారు. కొచ్చర్​ దంపతుల వినతిని అంగీకరించిన ఈడీ... సోమవారం విచారణ జరిపింది. నేడూ కొనసాగిస్తోంది.

వీడియోకాన్​కు రూ.1,875 కోట్ల రుణం మంజూరు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారన్నది చందాకొచ్చర్​, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​, వేణుగోపాల్​పై ప్రధాన ఆరోపణ. మార్చి 1న కొచ్చర్​, వీడియోకాన్​ ప్రతినిధి వేణుగోపాల్​ నివాసాలు సహా ముంబయి, ఔరంగాబాద్​లోని కార్యాలయాల్లో సోదాలు జరిపింది ఈడీ.

ఇదీ చూడండి:

8 గంటలపాటు కొచ్చర్​ను విచారించిన ఈడీ

ABOUT THE AUTHOR

...view details