మేఘాలయలోని వెస్ట్గారో డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తారు ఐఏఎస్ అధికారి రామ్ సింగ్. విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉన్నా.. ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ చేస్తారు. సమీప తురు ప్రాంతంలో సేంద్రియ కూరగాయలు కొనుగోలు చేసేందుకు 10కి.మీ దూరం కాలినడకనే వెళ్తారు. అప్పడప్పడూ తోడుగా తన భార్యను తీసుకెళ్తారు.
ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ, పార్కింగ్ ఇబ్బందులు ఉండకూడదనే తాను కాలినడక మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు రామ్ సింగ్. ఉదయాన్నే నడిస్తే శరీరం దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. అందుకే గత ఆరు నెలలుగా ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో ఉండి ఇలా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.