ఉత్తర్ప్రదేశ్ గజియాబాద్ జిల్లా కొవిడ్ నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సౌమ్య పాండే మాత్రం బిడ్డకు జన్మనిచ్చిన కేవలం 14రోజుల్లోనే విధులు హాజరయ్యారు. వృత్తి పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు.
‘"నేను ఓ ఐఏఎస్ అధికారిణిని కాబట్టి కుటుంబ బాధ్యతలతో పాటు నా విధులపైనా దృష్టి సారించాలి. దేవుడి దయ వల్ల నేను ఈ రోజు నా బిడ్డను చూసుకుంటూనే విధులకు సైతం హాజరు కాగలుగుతున్నాను. ఈ విషయంలో నా కుటుంబసభ్యులు ఎంతో అండగా నిలుస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఇప్పటివరకు విధుల పట్ల నాకు సహకారం అందించిన జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు. కొవిడ్ సమయంలో పనిచేసే ప్రతి గర్భిణీ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి’"