భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు వీర్‌చక్ర పురస్కారాన్ని ప్రదానం చేయనుంది కేంద్రం. బాలాకోట్ వైమానికి దాడుల్లో పాక్ సైన్యంతో వీరోచితంగా పోరాడినందుకు.. యుద్ధ సమయాల్లో సైనికులను సత్కరించే మూడో అత్యున్నత అవార్డును ఇవాళ అందజేయనుంది. మరో అయిదుగురు పైలట్లకు ఇదే పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. మహిళా అధికారిణి, స్వ్కాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్‌కు యుద్ధ సేవా మోడల్ లభించింది.
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఐదు యుధ్ సేవా, ఏడు వాయు సేనా మెడల్స్‌తో మొత్తం 13 అవార్డులు గెలుచుకుంది. రక్షణశాఖ అందించనున్న ఈ పురస్కారాల్లో ఎనిమిది శౌర్య చక్ర, 98 సేనా అవార్డులు అందుకోనుంది సైన్యం(ఆర్మీ). నావికా దళానికి ఒక శౌర్య చక్ర మెడల్‌ను అందించనున్నారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వీరందరికీ అవార్డులను అందించనున్నట్లు రక్షణశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఎవరికెన్ని పతకాలు..
సీఆర్పీఎఫ్ - 72
జమ్ముకశ్మీర్ పోలీసులు - 61
సీబీఐ అధికారులు - 32
ఒడిశా పోలీసులు - 23
ఛత్తీస్‌గఢ్ పోలీసులు - 9