తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాయుసేనలో రఫేల్​ చేరిక చరిత్రాత్మకం: రాజ్​నాథ్​

IAF to formally induct Rafale aircraft today
వాయుసేనలోకి అధికారికంగా చేరనున్న రఫేల్​

By

Published : Sep 10, 2020, 9:04 AM IST

Updated : Sep 10, 2020, 12:23 PM IST

12:14 September 10

రఫేల్​ చేరిక చరిత్రాత్మకం: రాజ్​నాథ్​

భారత వాయుసేనలో రఫేల్​ చేరిక చరిత్రాత్మకమని అన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఈ కీలక ఘట్టం సందర్భంగా త్రివిధ దళాలకు, ప్రజలకు అభినందనలు తెలిపారు.

రఫేల్​ ఒప్పందం భారత్​-ఫ్రాన్స్ బంధాన్ని బలపరుస్తోందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ మంచి ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉగ్రవాదంపై పోరులో రెండు దేశాల వైఖరి ఒక్కటేనని ఉద్ఘాటించారు రాజ్​నాథ్​.  ​ 

11:34 September 10

భారత్​, ఫ్రాన్స్​ బలమైన సంబంధాలకు ప్రతీక: రాజ్​నాథ్​

భారత వాయుసేనలోకి రఫేల్​ జెట్లు చేరటం, భారత్​, ఫ్రాన్స్ల బలమైన సంబంధాలను సూచిస్తోంది, ఇరుదేశాల వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. 

11:27 September 10

రఫేల్ రాకతో వాయుసేన మరింత పటిష్ఠమైంది: రాజ్‌నాథ్‌సింగ్‌

  • రఫేల్ రాకతో వాయుసేన మరింత పటిష్ఠమైంది: రాజ్‌నాథ్‌సింగ్‌
  • భారత వాయుసేన ఆయుధాగారంలో కొత్త పక్షి చేరినట్లు వాయుసేన ట్వీట్

11:19 September 10

వాయుసేనలోకి రఫేల్​ చేరిక సందర్భంగా.. స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్‌, సారంగ్‌ హెలికాప్టర్లు ఆకాశంలో వైమానిక విన్యాసాలు చేశాయి. రన్​వేపైకి దిగిన రఫేల్​ జెట్స్​కు వాటర్​ కెనాన్లతో సెల్యూట్​ చేశారు అధికారులు. 

11:13 September 10

భారత వాయుసేనలోకి అధికారింగా చేరిన తర్వాత సుఖోయ్​-30, జాగ్వార్​ యుద్ధ విమానాలతో పాటు తక్కువ వేగంతో గాల్లో విన్యాసాలు చేపట్టాయి. 

10:51 September 10

భారత వాయుసేనలోకి 'రఫేల్'​యుద్ధ విమానాలు​

రఫేల్​ యుద్ధవిమానాలు భారత వాయుసేనలో లాంఛనంగా చేరాయి. హరియాణాలోని అంబాలా ఎయిర్​ బేస్​లో 5 రఫేల్​ జెట్స్​ను ఫ్రాన్స్​ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లీతో కలిసి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అధికారికంగా వాయుసేనలో ప్రవేశపెట్టారు. అంబాలాలోని 17వ గోల్డెన్​ ఆరోస్​ స్క్వాడ్రన్​ లాంఛనంగా చేరాయి ఈ యుద్ధవిమానాలు. సుఖోయ్​ 30, జాగ్వర్​ యుద్ధ విమానాలతో పాటు రఫేల్​ జెట్స్​ విన్యాసాలు ప్రదర్శించాయి. 

ఈ కార్యక్రమంలో భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్ రావత్​, వైమానిక దళాధిపతి మార్షల్​ ఆర్​కేఎస్​ భదౌరియా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

10:32 September 10

సర్వ ధర్మ పూజలో నేతలు, అధికారులు

రఫేల్​ జెట్స్​ వాయుసేనలో ప్రవేశపెట్టే ముందు అంబాలా ఎయిర్​ బేస్​లో సంప్రదాయ సర్వ ధర్మ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్​, ఫ్రాన్స్​ రక్షణ మంత్రులు రాజ్​నాథ్​, ఫ్లోరెన్స్​  పార్లీ తోపాటు అధికారులు పాల్గొన్నారు.  

10:26 September 10

అంబాలా చేరుకున్న త్రిదళాధిపతి రావత్​​, ఎయిర్​ చీఫ్​

రఫేల్​ యుద్ధ విమానాలను వాయుసేనలో అధికారికంగా చేర్చే కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబాలా ఎయిర్​ బేస్​కు చేరుకున్నారు భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, వైమానిక దళాధిపతి ఆర్​కేస్​ భదౌరియా. 

10:22 September 10

అంబాలా చేరుకున్న రక్షణ మంత్రులు

హరియాణాలోని అంబాలా ఎయిర్​ బేస్​కు చేరుకున్నారు భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ఫ్రాన్స్​ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లీ.  కొద్ది సమయంలో రఫేల్​ యుద్ధవిమానాలను భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టనున్నారు. 

09:58 September 10

అంబాలా బయలుదేరిన భారత్​, ఫ్రాన్స్​​ రక్షణ మంత్రులు

రఫేల్​ జెట్స్​ వైమానిక దళంలోకి చేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంబాలా బయలుదేరారు భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​, ఫ్రాన్స్​ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లీ. పాలమ్​ వాయుసేన కేంద్రం నుంచి ప్రత్యేక విమానంలో అంబాలా చేరుకోనున్నారు. 

09:52 September 10

అంబాలా బయలుదేరిన భారత్​, ప్రాన్స్​ రక్షణ మంత్రులు

రఫేల్​ జెట్స్​ వైమానిక దళంలోకి చేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంబాలా బయలుదేరారు భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​, ఫ్రాన్స్​ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లీ. పాలమ్​ వాయుసేన కేంద్రం నుంచి ప్రత్యేక విమానంలో అంబాలా చేరుకోనున్నారు. 

09:45 September 10

ఫ్రాన్స్​ రక్షణ మంత్రితో రాజ్​నాథ్​ భేటీ

రఫేల్​ యుద్ధ విమానాలు అధికారికంగా వైమానదళంలోకి చేరే కార్యక్రమానికి హాజరయ్యే ముందు ఫ్రాన్స్​ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లీతో భేటీ అయ్యారు భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. పాలమ్​ వాయుసేన కేంద్రంలో ఇరువురు సమావేశంపై పలు అంశాలపై చర్చించినట్లు రక్షణ శాఖ కార్యాలయం తెలిపింది. అక్కడి నుంచి అంబాలాకు చేరుకుంటారని వెల్లడించింది. 

09:22 September 10

ఫ్రాన్స్​ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లీ దిల్లీ పాలెం అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నారు. భారత వాయుసేనకు రఫేల్​ జెట్లు అప్పగించే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.  

09:02 September 10

సిద్ధంగా రఫేల్​..

వాయుసేనకు రఫేల్ యుద్ధ విమానాలు అప్పగించేందుకు అంబాలా ఎయిర్​బేస్​లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది రక్షణ శాఖ. దీనికి భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, వాయుసేన సారథి రాకేశ్​ కుమార్​ సింగ్​ భదౌరియా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్​లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

08:51 September 10

వాయుసేనలోకి అధికారికంగా చేరనున్న రఫేల్​

రఫేల్ యుద్ధవిమానాలు భారత వాయుసేనలోకి నేడు లాంఛనంగా చేరనున్నాయి. హరియాణాలోని అంబాలా ఎయిర్ బేస్​లో ఐదు రఫేల్ యుద్ధవిమానాలను ఫ్రాన్స్  రక్షణమంత్రి ఫ్లోరెన్స్  పార్లీతో కలిసి రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ అధికారికంగా భారత వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు.

ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకోగా తొలి విడతగా ఐదు యుద్ధ విమానాలు జులై 29న భారత్ చేరాయి. రెండో విడతగా మరో 4 యుద్ధవిమానాలు నవంబర్​లో వచ్చే అవకాశం ఉంది. 

2021 చివరి నాటికి మొత్తం 36 రఫేల్ జెట్స్ భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు వాయుసేనకు చెందిన అంబాలాలోని 17వ గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ నుంచి సేవలు అందించనున్నాయి. 

Last Updated : Sep 10, 2020, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details