భారత వాయుసేనకు చెందిన ఇద్దరు జవాన్లు లేహ్‌లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో సవాళ్లతో కూడుకున్న వాతావరణంలో స్కై డైవ్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 8న సీ-130జే విమానం నుంచి డైవ్ చేసి ఈ విన్యాసాలు చేపట్టారు.
వింగ్ కమాండర్ గజనాద్ యాదవ్, వారంట్ ఆఫీసర్ ఏకే తివారీలు.. లేహ్‌లోని ఖర్దుంగ్లా పాస్‌లో ఈ ఫీట్ చేసి ఔరా అనిపించారు. 17,982 అడుగుల ఎత్తయిన ప్రాంతం ఖర్దుంగ్లా పాస్‌లో స్కై డైవ్ ల్యాండింగ్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు వాయుసేన వెల్లడించింది.