తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2019, 7:00 AM IST

Updated : Apr 9, 2019, 7:27 AM IST

ETV Bharat / bharat

'పాక్​ జెట్​ కూల్చివేత నిజమే- ఇవిగో సాక్ష్యాలు'

పాకిస్థాన్​కు చెందిన ఎఫ్​-16 యుద్ధవిమానాన్ని కూల్చినట్లు కచ్చితమైన ఆధారాలున్నాయని భారత వైమానిక దళం స్పష్టంచేసింది. పాక్​ ఫైటర్​ జెట్​ కూల్చివేతకు సంబంధించిన రాడార్​ చిత్రాలు విడుదల చేసింది. అమెరికా వార్తా పత్రికలో కథనం, పొరుగు దేశం తాజా ప్రకటనల నేపథ్యంలో ఈమేరకు మరింత స్పష్టత ఇచ్చింది భారత్​.

ఎఫ్​-16 రాడార్​ చిత్రాల విడుదల

'పాక్​ జెట్​ కూల్చివేత నిజమే- ఇవిగో సాక్ష్యాలు'

పాకిస్థాన్​కు చెందిన ఎఫ్​-16 యుద్ధ విమానం ప్రమాదానికి గురికాలేదని అమెరికాకు చెందిన ఓ వార్తా పత్రిక పేర్కొన్న నేపథ్యంలో భారత వైమానిక దళం ఆధారాలను బహిర్గతం చేసింది. ఫిబ్రవరి 27న జమ్ముకశ్మీర్​లోని నౌషెరాలో ఎఫ్​-16 యుద్ధ విమానం కూలిందని నిర్ధరించే రాడార్​ చిత్రాలను విడుదల చేసింది.

ఏడబ్ల్యూఏసీఎస్(ఎయిర్​బార్న్​ వార్నింగ్​, కంట్రోల్​ సిస్టమ్​) ​లో నమోదైన గ్రాఫిక్​ చిత్రాలను మీడియా సమావేశంలో చూపింది వాయుసేన.

" ఫిబ్రవరి 27న పాకిస్థాన్​ ఎఫ్-16 యుద్ధవిమానాన్ని వినియోగించినట్లు మాత్రమే కాదు భారతకు చెందిన మిగ్​-21 ఆ విమానాన్ని కూల్చినట్లు కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి."
- ఆర్​జీకే కపూర్​, ఎయిర్​ వైస్​ మార్షల్​

భారత్​కు చెందిన మిగ్​-21 కూలిపోయే ముందు పాక్​ ఎఫ్​-16ను భారత జవాను అభినందన్​ కూల్చివేసినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. కానీ యుద్ధంలో ఎలాంటి విమానం ధ్వంసం కాలేదని పాకిస్థాన్​ తిరస్కరించింది.

ఫిబ్రవరి 28న ఎఫ్​-16 నుంచి ప్రయోగించిన క్షిపణి ఏఎమ్​ఆర్​ఏఏఎమ్​ శిథిలాలను చూపింది భారత్​. అమెరికా తయారు చేసిన ఎఫ్​-16ను పాకిస్థాన్​ వినియోగించినట్లు పేర్కొంది.

ఆధారాలు చూపటంలో భారత్​ విఫలం

ఓ వైపు భారత్​ రాడార్​ చిత్రాలను విడుదల చేసినప్పటికీ పాక్​ బుకాయింపు చర్యలు కొనసాగించింది. ఎఫ్​-16 ఫైటర్​ జెట్​ను కూల్చినట్లు భారత్​ ఆధారాలు చూపటంలో విఫలమైందని పాకిస్థాన్​ సైన్యం చెప్పుకొచ్చింది.

పాక్​ ఆర్మీ మేజర్​ జనరల్​​

" మళ్లీ మళ్లీ చెప్పటం వల్ల అబద్ధాలు నిజాలు కావు. ఎఫ్​-16 కు చెందిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పినప్పటికీ భారత వైమానిక దళం ఇప్పటికీ వాటిని ప్రదర్శించలేకపోయింది."
-- మేజర్​ జనరల్​ ఆసిఫ్​ ఘఫూర్​, పాకిస్థాన్​ సైన్యం అధికార ప్రతినిధి

Last Updated : Apr 9, 2019, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details