తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొలి 'రఫేల్ విమానాన్ని' అందుకున్న వాయుసేన

ఫ్రాన్స్​కు చెందిన డసో ఏవియేషన్​ సంస్థ రూపొందిస్తోన్న తొలి రఫేల్​ విమానాన్ని స్వీకరించింది భారత వైమానిక దళం. గురువారం పారిస్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎయిర్​ మార్షల్​ చీఫ్ వీఆర్​ చౌదరి నేతృత్వంలోని ఐఏఎఫ్ అధికారులు మొదటి రఫేల్​ యుద్ధ విమానాన్ని అందుకున్నారు.

By

Published : Sep 21, 2019, 5:05 AM IST

Updated : Oct 1, 2019, 9:59 AM IST

తొలి 'రఫేల్ విమానాన్ని' అందుకున్న వాయుసేన

రఫేల్​ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరేందుకు మరో ముందడుగు పడింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్​కు చెందిన డసో సంస్థ తయారుచేసిన అత్యాధునిక తొలి రఫేల్​ యుద్ధ విమానాన్ని అందుకుంది భారత వైమానిక దళం(ఐఏఎఫ్​). ఎయిర్​ మార్షల్​ చీఫ్ వీఆర్​ చౌదరి నేతృత్వంలోని ఐఏఎఫ్ అధికారులు ఆర్​బీ-01 నంబరు గల రఫేల్​ వినానాన్ని.. పారిస్​లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో స్వీకరించారు.​ అనంతరం ఐఏఎఫ్​ బృందం రఫేల్​లో గంటపాటు పారిస్​ గగనతలంపై చక్కర్లు కొట్టినట్లు సమాచారం.

వచ్చేది 2020లోనే...

రఫేల్ ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించిన భారత వాయుసేన అధిపతి ఎయిర్​ మార్షల్​ ఆర్​కేఎస్ బదౌరియా పేరు వచ్చేలా రఫేల్​కు ఆర్​బీ-01 అనే నంబరు పెట్టారు. వచ్చే నెలలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఫ్రాన్స్​ పర్యటన సందర్భంగా అధికారికంగా రఫేల్​ విమానాలు భారత వైమానిక దళంలో చేరనున్నాయి. అయితే భారత్​కు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు పైలట్లకు శిక్షణ పూర్తి చేసిన అనంతరం 2020 మే లో భారత్​లో అడుగుపెట్టనున్నాయి రఫేల్ విమానాలు.

2016లో ఒప్పందం..

రక్షణ అవసరాల కోసం ఫ్రాన్స్‌ నుంచి 36 అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్‌ 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ విమానాలు ప్రస్తుతం ఫ్రాన్స్‌ వినియోగిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌ విమానాల కన్నా ఆధునికమైనందున.. భారత వాయుసేన పైలట్లకు దీనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 24 మందిని మూడు బ్యాచ్‌లుగా ఫ్రాన్స్‌కు పంపి వచ్చే ఏడాది మే నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. భారత్‌కు అందే రఫేల్‌ విమానాల విషయంలో మరింత ఖర్చుతో మన దేశ పరిస్థితులకు తగ్గట్లుగా అదనపు ఫీచర్లను జోడిస్తున్నారు. రఫేల్‌ విమానాల స్క్వాడ్రన్‌లను హరియాణాలోని అంబాలా, బంగాల్‌లోని హషిమరా వైమానిక స్థావరాల్లో మొహరించే అవకాశం ఉందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

Last Updated : Oct 1, 2019, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details