జూన్ 27న భారత వైమానిక దళానికి చెందిన 'జాగ్వర్' యుద్ధ విమానానికి ఆకాశంలో పక్షులు తగిలి ఇంజిన్ విఫలమైంది. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ నేర్పుతో విమానాన్ని అంబాలా ఎయిర్ బేస్‌లో సురక్షితంగా దింపారు. తాజాగా ఈ వీడియో బయటకొచ్చింది.
ఇందులో స్పష్టంగా విమానానికి పక్షుల గుంపు అడ్డురావడం.. వెంటనే బాంబులు కింద పడటం కనిపిస్తోంది. ఈ వీడియో చూస్తే పైలట్ వ్యవహరించిన తీరును ప్రశంసించకుండా ఉండలేరు.