తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రామీణ ప్రాంత వైరస్ బాధితుల కోసం వాయుసేన 'అర్పిత్' - indian air force services on corona

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారికోసం సరికొత్త ఆవిష్కరణ చేసింది భారతీయ వాయుసేన. మారుమూల ప్రాంతాల్లోని వారిని ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా పాడ్ తరహా హెలికాఫ్టర్ అర్పిత్​ను వైమానిక దళంలో ప్రవేశపెట్టింది.

iaf arpit
గ్రామీణ ప్రాంతంలోని రోగులకోసం వాయుసేన 'అర్పిత్'

By

Published : Jun 9, 2020, 5:22 AM IST

మారుమూల గ్రామాల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారిని ఆస్పత్రులకు చేర్చే ఉద్దేశంతో తయారుచేసిన పాడ్ తరహా హెలికాఫ్టర్ అర్పిత్​ను ప్రారంభించింది వాయుసేన. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారయిన ఈ హెలికాఫ్టర్​ను.. మారుమూల ప్రాంతాల్లో కరోనా సహా వివిధ వ్యాధులతో బాధపడుతూ.. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారికోసం వినియోగించనుంది.

"భారత వాయుసేన రూపొందించి, అభివృద్ధి చేసిన ఎయిర్​బోర్న్ రెస్క్యూ పాడ్ ఫర్ ఐసోలేటెడ్ ట్రాన్స్​పోర్టేషన్​ను(అర్పిత్) వైమానిక దళంలో ప్రవేశపెట్టాం."

-వాయుసేన ప్రకటన

కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లోని వారికి వైరస్ సోకకుండా రోగిని వేరే ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంటుంది. వాయుసేన తయారుచేసిన అర్పిత్ పాడ్ ఇందుకు అనువుగా ఉంటుంది. ఇందులోని వ్యవస్థను రూపొందించేందుకు రూ. 60,000 మాత్రమే ఖర్చయ్యాయని.. అదే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే రూ. 60 లక్షల ఖర్చు అవుతుందని వాయుసేన అధికారులు వెల్లడించారు.

ఈ చాపర్​లో వైద్య పరికరాలు, వెంటిలేటర్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. రోగులను సులభంగా ఎక్కించేందుకు వీలుంటుంది. ఈ హెలికాఫ్టర్​లోని మిగతా వారికి వైరస్ సోకకుండా ఉండేందుకు వీలుగా.. ప్రతికూల వాయు ఒత్తిడిని కలిగి ఉంటుందని వెల్లడించింది వైమానిక దళం.

ఇదీ చూడండి:ఆపరేషన్​ కరోనా: ఆ జిల్లాల్లో ఇంటింటి సర్వే!

ABOUT THE AUTHOR

...view details