తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత అమ్ములపొదిలోకి అత్యాధునిక 'అపాచీ' - యుద్ధవిన్యాసాలు

భారత వాయుసేన అమ్ములపొదిలో మరో 8 అత్యాధునిక 'అపాచీ ఏహెచ్-64' హెలికాప్టర్లు చేరాయి. పంజాబ్​లోని పఠాన్​కోట్​ వైమానికదళానికి ఈ యుద్ధ హెలికాప్టర్లు అప్పగించింది బోయింగ్​. 'అపాచీ' చేరికతో భారత వైమానిక దళం మరింత బలంగా తయారవుతుందని పేర్కొన్నారు ఎయిర్​చీఫ్​ మార్షల్​ ధనోవా.

భారత అమ్ములపొదిలోకి అత్యాధునిక 'అపాచీ'

By

Published : Sep 3, 2019, 2:45 PM IST

Updated : Sep 29, 2019, 7:12 AM IST

భారత అమ్ములపొదిలోకి అత్యాధునిక 'అపాచీ'

ప్రపంచంలోనే అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరాయి. ఇప్పటికే నాలుగు హెలికాప్టర్లను భారత్​కు అందించిన అమెరికాకు చెందిన బోయింగ్​ విమాన సంస్థ. నేడు మరో 8 అత్యాధునిక అపాచీ ఏహెచ్​-64 ఈ హెలికాప్టర్లను అప్పగించింది.

మొత్తం 27 హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్​తో ఒప్పందం కుదుర్చుకుంది వాయుసేన. ఈ ఒప్పందంలో భాగంగా జులై 27న తొలి నాలుగు హెలికాప్టర్లు భారత్​లో అడుగుపెట్టాయి. ఇవాళ మరో 8 హెలికాప్టర్లను పఠాన్​కోట్​ వైమానిక దళానికి అప్పగించింది.

ఈ సందర్భంగా భారత వాయుసేన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మొదట ఐఏఎఫ్​ ఎయిర్ చీఫ్​ ​మార్షల్​ బీఎస్​ ధనోవా ఆధ్వర్యంలో వీటికి పూజలు నిర్వహించి... జలఫిరంగులతో వాయుసేన సైనికులు అపాచీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్తా సెరిమోనియల్‌ కీని ధనోవాకు అందించారు. అంతకుముందు వీటికి సంబంధించిన అన్ని రకాలు ముందస్తు పరీక్షలను ఐఎఫ్​ఎస్​ హిండన్‌ వాయుస్థావరంలో విజయవంతంగా జరిపినట్లు భారత వాయుసేన వెల్లడించింది.

ప్రపంచంలోనే అత్యుత్తమం అపాచీ: ధనోవా

అపాచీ యుద్ధవిమానాల చేరిక పట్ల సంతోషం వ్యక్తం చేశారు ధనోవా. భారత వాయుసేన మరింత బలంగా తయారవుతుందని అభిప్రాయపడ్డారు.

''అపాచీ యుద్ధ హెలికాప్టర్లు భారత వాయుసేనలో భాగస్వామ్యం అవడం పట్ల మేమంతా సంతోషిస్తున్నాం. భారత వాయుసేనలో 1954 నుంచి హెలికాప్టర్లను ఉపయోగిస్తుంది. అప్పటినుంచి వెనుకడుగు వేయలేదు. ప్రపంచవ్యాప్తంగా మన సత్తా ఏంటో నిరూపించుకున్నాం.

భారత వాయుసేనలో గత మూడు దశాబ్దాలుగా ఎమ్​ఐ-35 హెలికాప్టర్లు కీలకంగా వ్యవహరించాయి. భారతదేశ వ్యాప్తంగా విభిన్న ప్రయోగాలు నిర్వహించాయి. అపాచీ యుద్ధ విమానాలను.. కాలం చెల్లిన ఎమ్​ఐ-35 హెలికాప్టర్ల స్థానంలో తీసుకొస్తున్నాం. అపాచీ అత్యాధునిక సాంకేతికతతో బహుళ మిషన్​ హెలికాప్టర్​గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. అమెరికా, బ్రిటన్​, ఇజ్రాయెల్​ సహా పలు దేశాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు.

ప్రపంచంలోని అత్యంత భీకరమైన యుద్ధవిమానాల్లో అపాచీ ఒకటి. నేడు ఈ అపాచీ ఏహెచ్​-64 యుద్ధ విమానాలను చేర్చుకొని భారత వాయుసేన తన అమ్ములపొదిని మరింత అభివృద్ధి చేసుకుంది.''

- బీఎస్​ ధనోవా, ఐఏఎఫ్​ ఎయిర్​ చీఫ్​ మార్షల్​

నాలుగేళ్ల తర్వాత...

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలన్నింటికి కలిపి మొత్తం 2,200 అపాచీ హెలికాప్టర్లను అందించింది బోయింగ్. 2015 సెప్టెంబర్​లో 22 అపాచీ ఛాపర్ల కొనుగోలుకు అమెరికాతో భారత వాయుసేన బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో మరో 6హెలికాప్టర్లతో పాటు ఆయుధ సామగ్రి కొనుగోలుకు రూ.4,168 కోట్ల ఒప్పందం చేసుకుంది రక్షణ శాఖ.

2020 నాటికి మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లు భారత్​ అమ్ములపొదిలో ఉంటాయి. 2018 జులైలోనే ఈ హెలికాప్టర్ల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది భారత్​. వీటిని నడిపేందుకు వాయుసేన బృందం అమెరికాలో శిక్షణ తీసుకుంటోంది.

ఇదీ చూడండి:సెప్టెంబర్​లో భారత్​కు 'స్పైస్​-2000' బాంబులు

Last Updated : Sep 29, 2019, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details