తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాయుసేన అమ్ముల పొదిలో 'అపాచీ' హెలికాప్టర్లు

భారత వాయుసేన అమ్ముల పొదిలో అతి త్వరలో సరికొత్త అస్త్రం చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక శ్రేణికి చెందిన యుద్ధ హెలికాప్టర్ 'ఏహెచ్​-64ఈ అపాచీ' త్వరలో వైమానిక దళంలో చేరనుంది. అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ నాలుగేళ్ల క్రితం కుదిరిన అమ్మకం ఒప్పందం మేరకు నాలుగు ఏహెచ్​-64 అపాచీ హెలికాప్టర్లను భారత్​కు అందజేసింది.

By

Published : Jul 27, 2019, 10:15 PM IST

వాయుసేన అమ్ముల పొదిలో 'అపాచీ' హెలికాప్టర్లు

భారత వాయుసేన మరింత శక్తిమంతం కానుంది. త్వరలో వైమానిక దళం అమ్ముల పొదిలో ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్​ 'ఏహెచ్- 64ఈ అపాచీ' హెలికాప్టర్లు చేరనున్నాయి.

అమెరికా విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ నాలుగేళ్ల క్రితం భారత్​తో​ చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు హెలికాప్టర్లను అందజేసింది.

మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లను భారత్​కు అందజేసేందుకు ఒప్పందం కుదరగా తొలి విడతగా నాలుగు హెలికాప్టర్లను అందజేసింది. మరో నాలుగు హెలికాప్టర్లు వచ్చే వారం అందించనుంది. మొత్తం 8 అపాచీ హెలికాప్టర్లు పఠాన్​కోట్ వైమానిక కేంద్రం నుంచి త్వరలో భారత వైమానిక దళంలో లాంఛనంగా చేరనున్నాయి.

2015లో బోయింగ్​ 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదరగా, 2017లో రూ. 4,168 కోట్లతో మరో నాలుగు హెలికాప్టర్లు, ఆయుధ సంపత్తి కొనుగోలుకు ఒప్పందం జరిగింది. భారత వైమానిక దళం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అపాచీ చేరికతో తమ పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని ఐఏఎఫ్​ ఆశాభావం వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details