మరికొన్ని గంటల్లో చంద్రయాన్-2 జాబిల్లిపై దిగుతున్న వేళ గగన్‌యాన్ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు ముమ్మరం చేసింది. 2022లో చేపట్టే గగన్‌యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి పంపే వ్యోమగాముల ఎంపిక ప్రక్రియలో మొదటి దశను ఇస్రో పూర్తి చేసింది.
భారత వాయుసేన ఆధ్వర్యంలోని 'ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్- బెంగళూరు'లో వ్యోమగాములుగా ఎంపికైన టెస్ట్ పైలట్లకు వైద్య పరీక్షలు నిర్వహించింది.
"భారత వ్యోమగాముల ఎంపికలో మొదటి దశను ఐఏఎఫ్ పూర్తి చేసింది. ఎంపికైన టెస్ట్ పైలట్లకు శారీరక వ్యాయామ, రేడియోలాజికల్, క్లినికల్, మానసిక దృఢత్వ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాం."
-భారత వాయుసేన
మొదటి దశ ఎంపిక కోసం 25 టెస్ట్ పైలట్లను పరీక్షించగా 2 లేదా 3 అభ్యర్థులకు వాయుసేన ఆమోదం తెలిపినట్లు సమాచారం.