తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వీరులకు త్రివిధ దళాల సలాం

కరోనాపై పోరులో నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులకు గౌరవ వందనం సమర్పించాయి త్రివిధ దళాలు. కొవిడ్​ వీరుల కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసేలా, వారిలో సరికొత్త ఉత్సాహం నింపేలా దేశ నలుమూలలా ప్రత్యేక బ్యాండ్లు, కవాతులు, యుద్ధ విమానాల విన్యాసాలు, పూలవర్షాలతో సలాం చేశాయి.

IAF chopper to shower flower petals to thank corona warriors on Sunday
కరోనా వీరులకు వందనం.. ఆసుపత్రులపై పూల వర్షం

By

Published : May 3, 2020, 11:02 AM IST

Updated : May 3, 2020, 2:27 PM IST

కరోనా వీరులకు త్రివిధ దళాల వందనం

కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం లభించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులను ప్రత్యేకంగా అభినందించాయి త్రివిధ దళాలు. ప్రత్యేక సైనిక బ్యాండ్లు, కవాతులు, యుద్ధ విమానాల విన్యాసాలు, చాపర్లు, హెలికాఫ్టర్లతో పూలవర్షాలతో కృతజ్ఞత తెలిపాయి.

తొలుత దిల్లీలోని పోలీసు అమరవీరుల స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు త్రివిధ దళాల అధిపతులు. అనంతరం వైమానిక, సైనిక, నావికాదళ చాపర్లు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ పోరాటం చేస్తున్న కరోనా యోధులను కీర్తించిన సాయుధ బలగాలు... కొవిడ్​ బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందిస్తూ ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి. త్రివిధ దళాలకు చెందిన జెట్లు, చాపర్లు, హెలికాఫ్టర్లతో వందనాలు సమర్పించాయి.

ఆర్మీ బ్యాండ్స్‌... వైద్యశాలల వద్ద బ్యాండ్స్‌ను వాయిస్తూ దేశభక్తి గీతాలను ఆలపించాయి.

రాజ్​పథ్​ మీదగా విన్యాసాలు..

యుద్ధవిమానాలు దిల్లీ రాజ్​పథ్​ మీదగా విన్యాసాలు నిర్వహించాయి. ముంబయిలో సుకోయ్​-30 యుద్ధవిమానాలు ఆకాశంలో తిరగాడాయి. లఖ్​నవూ కింగ్​ జార్జి మెడికల్​ యూనివర్సిటీ, భువనేశ్వర్​లోని కళింగ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ ఆసుపత్రులపై చక్కర్లు కొట్టాయి.

పనాజీలోని గోవా ప్రభుత్వాస్పత్రి, హరియాణా పంచకుళలో ప్రభుత్వ కొవిడ్​ ఆసుపత్రిపై పూలవర్షం కురిపిస్తుంటే జనం కేరింతలు కొట్టారు. వందన సమర్పణను చప్పట్లతో స్వాగతించారు.

కరోనా యోధులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఇవాళ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు త్రివిధ దళాధిపతి బిపిన్​ రావత్ శుక్రవారమే​ చెప్పారు.

Last Updated : May 3, 2020, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details