తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మన హెలికాప్టర్​ను మనోళ్లే​ కూల్చేశారు..!

జమ్ముకశ్మీర్​లోని బుడ్గామ్​లో ఫిబ్రవరి 27న కూలిన హెలికాప్టర్ ప్రమాదానికి అందులోని వైమానిక దళ అధికారులదే తప్పని విచారణ కోర్టు తేల్చింది. హెలికాప్టర్​ శత్రువుదా? మనదేనా? అని సూచించే 'ఐడెంటిఫికేషన్​ ఆఫ్​ ఫ్రెండ్​ ఆర్​ ఫో' మీటను పైలట్​ ఆఫ్​ చేసి ఉండటమే కారణమని తెలిపింది.

బటన్​ నొక్కలేదని.. మన హెలికాప్టర్​ను మనోళ్లే​ కూల్చేశారు

By

Published : Aug 24, 2019, 5:10 AM IST

Updated : Sep 28, 2019, 1:49 AM IST

కశ్మీర్​లోని బుడ్గామ్​ జిల్లాలో ఫిబ్రవరి 27న కూలిన భారత వాయుసేన హెలికాప్టర్ 'ఎంఐ-17వి-5​' ప్రమాదానికి కారణాలను విచారణ కోర్టు వెల్లడించింది. 6 నెలలు కొనసాగిన ఈ దర్యాప్తులో ప్రమాదానికి కారణం అందులోని అధికారులదేనని తీర్పునిచ్చింది.

హెలికాప్టర్​లో ఉన్నది శత్రువా, మిత్రుడా అని తెలిపే 'ఐడెంటిఫికేషన్​ ఆఫ్​ ఫ్రెండ్​ ఆర్​ ఫో' మీట ఉంటుంది. ఈ మీట ఆన్ చేసి ఉంటేనే ఛాపర్​ ఎవరిదనేది రాడార్లు గుర్తిస్తాయి. దీనిని పైలట్ ఆన్​ చేయకపోవడం వల్ల అది శత్రు దేశానికి చెందిన ఛాపర్​ అనుకొని ఉపరితల మిస్సైల్​ ద్వారా పేల్చివేశారు.
ఈ చర్యతో ఛాపర్​లోని అధికారులు వాయుసేన నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు పేర్కొంది.

పాక్​ హెలికాప్టర్​గా భావించి..

ఫిబ్రవరి 26న పాక్​లోని బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వైమానిక దాడులు చేసింది భారత వాయుసేన. ఈ దాడి మరుసటి రోజైన ఫిబ్రవరి 27న ఉదయం 9.30 గంటల సమయంలో పాక్ వైమానిక దళం విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. పాక్​ విమానాల్ని సమర్థంగా తిప్పికొట్టింది భారత వాయుసేన.

ఈ క్రమంలోనే ఉదయం 10.10 గంటలకు హెలికాప్టర్​ను మన రాడార్లు గుర్తించాయి. ఛాపర్​ను పాకిస్థాన్​కు చెందినది భావించి ఉపరితల క్షిపణి ద్వారా క్షణాల్లో కూల్చేసింది.

శ్రీనగర్​కు తిరిగి వెళుతుండగా..

పాక్​ విమానాలు భారత్​లోకి చొరబడిన సమయంలో వాటిని అడ్డుకునేందుకు శ్రీనగర్​లో గాల్లోకి లేచింది ఈ హెలికాప్టర్​. అయితే శ్రీనగర్​ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని ఛాపర్​ను వెనక్కిపిలిచారు. ఈ సమయంలో గుర్తించిన ఉపరితల వైమానిక దళం హెలికాప్టర్​ను నేలమట్టం చేసింది.

ఛాపర్​ను స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ్ విశిష్ఠ్ నడిపారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్​లో ఉన్న ఆరుగురు సైనికులు, ఓ పౌరుడు అక్కడిక్కడే మృతిచెందారు.

ఇదీ చూడండి: 13 ఏళ్ల వయసులోనే రూ.లక్ష దొంగతనం

Last Updated : Sep 28, 2019, 1:49 AM IST

ABOUT THE AUTHOR

...view details